బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తొలగింపు.. ఇదీ కారణం : గుంటూరు మున్సిపల్ కమీషనర్ వివరణ

By Siva KodatiFirst Published Oct 4, 2022, 6:58 PM IST
Highlights

గుంటూరులోని దివంగత సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహాం తొలగింపు వ్యవహారంపై నగర మున్సిపల్ కమీషనర్ చేకూరి కీర్తి స్పందించారు. తాము అనుమతించిన చోట కాకుండా మరో చోట విగ్రహాన్ని పెట్టారని ఆమె తెలిపారు.

గుంటూరులోని దివంగత సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహాం తొలగింపు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గుంటూరు మున్సిపల్ కమీషనర్ కీర్తి చేకూరి స్పందించారు. నగరంలో ఎస్పీ బాలు విగ్రహా ఏర్పాటుకు సంబంధించి అపోహలు వచ్చాయని ఆమె అన్నారు. 2021 జూన్ 5నే బాలు విగ్రహా ఏర్పాటుకు అనుమతి ఇచ్చారని కమీషనర్ స్పష్టం చేశారు. నాజ్ సెంటర్ లో బాలు విగ్రహా ఏర్పాటు అనుమతి ఇచ్చారని కీర్తి చెప్పారు. నాజ్ సెంటర్ లో ఏర్పాటు చేయకుండా మదర్ థెరిస్సా సెంటర్‌లో విగ్రహం పెట్టారని కమీషనర్ పేర్కొన్నారు. 

అనుమతి లేని చోట విగ్రహం పెట్టడంతోనే తొలగించామని కీర్తి స్పష్టం చేశారు. నాజ్ సెంటర్‌లో విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చని కళా దర్బార్ సంస్థ సభ్యులకు చెప్పామని ఆమె తెలిపారు. బాలుని అగౌరవ పర్చాలని తొలగించ లేదని కమీషనర్ వివరణ ఇచ్చారు. ఎక్కడైతే అనుమతి ఇచ్చామో అక్కడ ఏర్పాటు చేసుకోవాలని కీర్తి స్పష్టం చేశారు. బిపి మండల్ విగ్రహానికి కూడా అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పామని మున్సిపల్ కమీషనర్ వెల్లడించారు. 

Also Read:గుంటూరులో ఎస్పీ బాల సుబ్రమహ్మణ్యం విగ్రహం తొలగింపు.. క‌ళాకారుల ఆగ్ర‌హం..

కాగా.. కొద్దిరోజుల క్రితం గుంటూరులో ఏర్పాటు చేసిన ఎస్పీ బాల సుబ్రమహ్మణ్యం విగ్ర‌హాన్ని మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు తొలగించ‌డం వివాదాన్ని రేకెత్తించింది. కొంత కాలం కిందట మదర్ థెరీసా చౌర‌స్తాలో కళా దర్బార్ త‌రుఫున విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. అయితే దీనికి అనుమ‌తి లేదంటూ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ సిబ్బంది దానిని అక్క‌డి నుంచి తొల‌గించారు. ఈ చ‌ర్య‌పై క‌ళాకారులు మున్పిస‌ల్ కార్పొరేష‌న్ ఆఫీస‌ర్ల‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. 

ఈ సంద‌ర్భంగా కళాదర్బార్ అధ్యక్షుడు పొత్తూరి రంగారావు మాట్లాడుతూ.. గాయ‌కుడు ఎస్పీ బాలు విగ్ర‌హం ఏర్పాటు చేసేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని రెండు సంవ‌త్స‌రాలుగా ఆఫీస‌ర్ల చుట్టూ తిరిగామ‌ని ఆయ‌న అన్నారు. త‌రువాత విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశామ‌ని చెప్పారు. కానీ దానిని ఎందుకు తొల‌గించార‌ని ప్రశ్నించారు. అంత గొప్ప గాయ‌కుడైన ఎస్పీ బాల సుబ్రమహ్మణ్యంకు మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఆఫీస‌ర్లు ఇచ్చే గౌర‌వం ఇదేనా అని అన్నారు. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ల‌లో గుంటూరు సిటీలో మాత్ర‌మే ఎస్పీ బాలు విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశార‌ని చెప్పారు. మ‌రెక్కడా లేవ‌ని అన్నారు. అయితే ఈ గుంటూరు సిటీలో దాదాపు 200పైగా అనుమ‌తి లేని విగ్ర‌హాలు ఉన్నాయ‌ని తెలిపారు. కానీ ఒక్క బాలు విగ్ర‌హాన్ని ఎందుకు తొల‌గించార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వెంట‌నే మ‌హా గాయ‌కుడైన ఎస్పీ బాల సుబ్ర‌హ్మ‌ణ్యం విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేశారు. 
 

click me!