గుంటూరు జైలులో... ఖైదీ నెం 3468గా రఘురామకృష్ణంరాజు

By Siva KodatiFirst Published May 16, 2021, 5:59 PM IST
Highlights

ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో పాటు కొన్ని వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగేలా వ్యాఖ్యలు చేశారన్న అభియోగంపై అరెస్ట్ అయి ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో వున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును పోలీసులు జైలుకు తరలించారు. ఈ సందర్భంగా ఆయనకు జైలు అధికారులు పాత బ్యారక్‌లోని ఓ సెల్‌ను, ఖైదీ నెం. 3468 కేటాయించారు. 

రఘురామకృష్ణంరాజు ఆరోగ్యం, ఆయన కాలి గాయాలపై మెడికల్ బోర్డ్ నివేదిక తయారు చేసి సీల్డ్ కవర్‌లో జిల్లా మేజిస్ట్రేట్‌కు అందజేసింది. అనంతరం దీనిని జిల్లా కోర్ట్ నుంచి హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్‌ నివాసానికి పంపారు.

కాగా, హైదరాబాద్‌లో రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేసిన సీఐడీ శనివారం గుంటూరులోని సీబీసీఐడీ కోర్టులో హాజరుపరిచింది. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం రఘురామకృష్ణంరాజుకు ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది.

Also Read:రఘురామ ఆరోగ్యంపై హెల్త్ రిపోర్ట్... మేజిస్ట్రేట్‌కు అందజేసిన వైద్యుల కమిటీ

ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది. వైద్య పరీక్షల అనంతరం రిపోర్ట్‌ను నివేదిక రూపంలో అందజేయాలని ఆదేశించింది. దీంతో ఆదివారం గుంటూరు జీజీహెచ్‌లో ఎంపీకి టెస్టులు నిర్వహించారు వైద్యులు. 

మరోవైపు ఈ కేసులో రఘురామకృష్ణంరాజుపై 12/2021 నమోదు చేశారు.  అంతేకాదు ఈ కేసులో ఏ-1గా రఘురామకృష్ణరాజు,  ఏ- 2గా టీవీ5,  ఏ- 3గా ఏబీఎన్‌ ఛానల్‌ను సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. సీఐడీ డీఐజీ ఎంక్వైరీ రిపోర్టు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. రఘురామపై అభియోగాలను సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచింది. 

click me!