గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో దారుణం జరిగింది. మనస్పర్థల కారణంగా కట్టుకున్న భార్యపై ఓ వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో దారుణం జరిగింది. మనస్పర్థల కారణంగా కట్టుకున్న భార్యపై ఓ వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే... నియోజకవర్గ పరిధిలోని ఎడ్లపాడు మండలం బోయపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఒరిస్సాకు చెందిన ఫోపూన్ గనున్ (37) రీటా (28) ఇద్దరూ భార్య భర్తలు. వీరు స్థానికంగా ఉన్న రంగనాయక స్పిన్నింగ్ మిల్లులో కార్మికులుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే భార్యపై అనుమానంతో గనున్ ఆమెను వేధింపులకు గురిచేయడంతో కుటుంబంలో కలహాలు చోటు చేసుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో ఆదివారం మరోసారి వీరి మధ్య గొడవ జరగ్గా... గనున్ ఆగ్రహంతో భార్య రీటా గొంతు కోసాడు . వెంటనే స్పందించిన స్థానికులు అతనిని స్తంభానికి కట్టి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
అయితే తనపై బ్లేడుతో దాడి చేసేందుకు ప్రయత్నించగా.. ఆత్మరక్షణ కోసం తాను కూడా భార్యపై దాడి చేసినట్లు ఫోపూన్ పోలీసు విచారణలో తెలిపాడు. గాయపడిన రీటాను పోలీసులు చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.