మీ లాభం కోసం కౌన్సిల్ ను వాడుకుంటున్నారు: గుంటూరు కౌన్సిల్ సమావేశంలో మేయర్ పై ముస్తఫా ఫైర్

Published : Aug 17, 2023, 02:46 PM IST
మీ లాభం కోసం కౌన్సిల్ ను వాడుకుంటున్నారు: గుంటూరు కౌన్సిల్ సమావేశంలో  మేయర్ పై ముస్తఫా ఫైర్

సారాంశం

తన అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ది పనులు జరగడం లేదని  కార్పోరేషన్ సమావేశంలోనే మేయర్ కు వ్యతిరేకంగా  ఎమ్మెల్యే  ముస్తఫా  గళం ఎత్తారు. ఎమ్మెల్యేకు మేయర్ మనోహర్ కూడ కౌంటరిచ్చారు.  

గుంటూరు: గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ సమావేశంలో  స్వంత పార్టీ మేయర్ పై  ఎమ్మెల్యే  ముస్తఫా  తీవ్ర ఆగ్రహం వ్యక్తం  చేశారు.  కార్పోరేషన్ సమావేశంలో   అభివృద్ధి పనుల విషయమై  మేయర్  మనోహర్ పై  వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో  నిధుల  కొరత కారణంగా పనులు జరగడం లేదని ఆయన  ఆవేదన వ్యక్తం  చేశారు. 

గుంటూరు అభివృద్ది అటకెక్కిందన్నారు.  మీ లాభం కోసం  కౌన్సిల్ ను వాడుకుంటున్నారని  మేయర్ పై  ముస్తపా  విమర్శలు చేశారు. మీకు ఓటు వేస్తే గుంటూరు అభివృద్ది అటకెక్కించారని మండిపడ్డారు. అయితే  ఈ విషయమై  ఎమ్మెల్యే  చేసిన విమర్శలకు  మేయర్ కూడ అదే స్థాయిలో  కౌంటర్ ఇచ్చారు.  గుంటూరు అభివృద్దిపై  చర్చకు సిద్దమని మేయర్ మనోహర్ ప్రకటించారు.

ఎమ్మెల్యే ముస్తఫా నియోజకవర్గంలో  అభివృద్ది పనుల గురించి అన్నీ విషయాలను  తాను వివరిస్తానని  తేల్చి చెప్పారు.కౌన్సిల్ సమావేశం ముగిసిన తర్వాత  ఎమ్మెల్యే ముస్తఫా మీడియాతో మాట్లాడారు. గత సమావేశంలో తాను గొడవ పెట్టుకున్నందుకు  పనుల్లో కొంత వేగం పెరిగిందన్నారు.   మేయర్ ఆర్డర్ వేస్తే పనులు ఎందుకు ఆగుతున్నాయని ఆయన  ప్రశ్నించారు.
 

PREV
click me!

Recommended Stories

వొళ్ళు గగురు పుట్టే విన్యాసాలతో అదరగొట్టిన పోలీస్ సిబ్బంది | Nara Lokesh | Independence Day | Stunts
ఈ బైకర్ విన్యాసాలకి మంత్రి నారా లోకేష్ ఫిదా | Nara Lokesh Particepate Independence Day Celebrations