మేడికొండూరు గ్యాంగ్‌రేప్ కేసు: పోలీసుల తీరుపై విమర్శలు.. స్పందించిన గుంటూరు డీఐజీ

By Siva KodatiFirst Published Sep 10, 2021, 8:24 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గుంటూరు జిల్లా మేడికొండూరు సామూహిక అత్యాచార ఘటనపై గుంటూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమవర్మ స్పందించారు. ఈ వ్యవహారంలో పోలీసుల నిర్లక్ష్యం లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై డీఐజీ ఓ ప్రకటన విడుదల చేశారు.   

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గుంటూరు జిల్లా మేడికొండూరు సామూహిక అత్యాచార ఘటనపై గుంటూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమవర్మ స్పందించారు. ఈ వ్యవహారంలో పోలీసుల నిర్లక్ష్యం లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై డీఐజీ ఓ ప్రకటన విడుదల చేశారు.   

బాధితులు సత్తెనపల్లి పీఎస్‌ కు రాగానే పోలీసులు స్పందించారని.. వివరాలు తెలుసుకుని మేడికొండూరు పోలీసులకు సమాచారం ఇచ్చారని త్రివిక్రమ వర్మ స్పష్టం చేశారు. నిందితుల కోసం సత్తెనపల్లి పోలీసులూ ఘటనాస్థలానికి వెళ్లారని.. ఘటనపై ఐపీసీ సెక్షన్‌ 376డి, 394, 342 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని డీఐజీ వెల్లడించారు. అత్యాచారం ఘటనలో పోలీసుల అలసత్వం లేదని.. ఘటనాస్థలికి వెళ్లలేకపోతేనే జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తారని ఆయన స్పష్టం చేశారు. సత్తెనపల్లి పోలీసులు వెంటనే స్పందించి ఘటనాస్థలికి వెళ్లారు’’ అని డీఐజీ వెల్లడించారు.

ALso Read:గుంటూరు జిల్లాలో భర్తను కొట్టి భార్యపై గ్యాంగ్ రేప్: 8 మంది అరెస్టు

కాగా, అత్యాచారం జరిగిన ఘటనా స్థలం నుంచి రాత్రి 12.45 గంటలకు బయల్దేరిన బాధితులు ఒంటిగంటకల్లా సత్తెనపల్లి పట్టణ పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. వారి నుంచి సమాచారం తెలుసుకుని వెంటనే జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసి దర్యాప్తు చేపట్టాల్సిన అక్కడి పోలీసులు.. అది తమ పరిధిలోకి రాదంటూ మేడికొండూరుకు పీఎస్‌కు సమాచారం ఇచ్చారు. అక్కడి పోలీసులు సత్తెనపల్లి స్టేషన్‌కు చేరుకునే వరకూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు ప్రక్రియ పూర్తికాలేదు. చివరికి బాధితుల్ని మేడికొండూరు ఠాణాకు తీసుకెళ్లి అక్కడ కేసు పెట్టారు. ఈ ప్రక్రియ జాప్యమవ్వటంతో నిందితులు తప్పించుకునేందుకు ఆస్కారం ఏర్పడిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే డీఐజీ స్పందించారు. 

click me!