Asianet News TeluguAsianet News Telugu

గుంటూరు జిల్లాలో భర్తను కొట్టి భార్యపై గ్యాంగ్ రేప్: 8 మంది అరెస్టు

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలో జరిగిన మహిళ సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ సంఘటనకు సంబంధించి 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Husband thrashed, wife molested in Guntur district, 8 arrested
Author
Medikonduru, First Published Sep 9, 2021, 11:33 AM IST

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగు అడ్డరోడ్డుపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనలో పోలీసులు పురుగోతి సాధించారు. పాలడుగు సమీపంలోని కోల్డ్ స్టోరేజ్ లో పనిచేసే 8 మంది కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారంతా ఒడిశాకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాకు చెందిన యువకులు, నిందితులపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో కీచకులు రెచ్చిపోయారు. దారుణమైన సంఘటనకు ఒడిగట్టారు. ఓ మహిళపై దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగు గ్రామంలో ఆ సంఘటన చోటు చేసుకుంది.

బైక్ మీద వెళ్తున్న దంపతులను దుండగులు ఆపారు. మహిళ భర్తను తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత కత్తులతో బెదిరించి మహిళను పొలాల్లోకి తీసుకుని వెళ్లి అక్కడ సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటనపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

సత్తెనపల్లి మండలానికి చెందిన భార్యాభర్తులు గుంటూరు నగరంలో ఓ వివాహానికి హాజరై తిరిగి వెళ్తుంమడగా దుండగులు అడ్డగించారు. భర్తపై దాడి చేసి, భార్యపై సమీపంలోని పొలాల్లో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దానిపై బాధితురులు అర్థరాత్రి సత్తెనపల్లి పోలీసు స్టేషన్ కు వెళ్లారు. అయితే, పోలీసులు ఫిర్యాదను తీసుకోవడానికి నిరాకరించారు. 

ఘటన జరిగిన ప్రదేశం గుంటూరు అర్బన్ ఎస్పీ పరిధిలోకి వస్తుందని, తమ పోలీసు స్టేషన్ ఆ పరిధిలోకి రాదని వారు చెప్పారు. దాంతో బాధితులు వెనక్కి మళ్లారు. ఘటన ఎక్కడ జరిగినా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని కేసును సంబంధిత పోలీసు స్టేషన్ కు బదిలీ చేయాలని ఉన్నతాధికారులు గతంలోనే ఆదేశించినప్పటికీ సత్తెనపల్లి పోలీసులు ఫిర్యాదును తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios