నారా లోకేశ్‌పై కేసు నమోదు చేసిన బెజవాడ పోలీసులు.. కారణమిదే..?

By Siva KodatiFirst Published Sep 10, 2021, 6:21 PM IST
Highlights

కొన్నినెలల కిందట గుంటూరు జిల్లా నరసరావుపేటలో అనూష హత్యకు గురైంది. ఆమె కుటుంబాన్ని పరామర్శించాలని లోకేశ్ భావించినా, పోలీసులు అడ్డుకోవడంతో చివరికి వీడియో కాల్ ద్వారా అనూష కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అయితే, కొవిడ్ నిబంధనల అతిక్రమణ, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించడం వంటి అభియోగాలపై లోకేశ్ మీద కేసు నమోదు చేశారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌పై విజయవాడ కృష్ణలంక పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిన్న నరసరావుపేటలో పర్యటించేందుకు గన్నవరం వచ్చిన లోకేశ్‌ను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. అయితే, కొవిడ్ నిబంధనల అతిక్రమణ, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించడం వంటి అభియోగాలపై లోకేశ్ మీద కేసు నమోదు చేశారు. ఈమేరకు సెక్షన్ 186, 341, 269 కింద ఈ కేసు నమోదు చేశారు.

నిన్న గన్నవరం వచ్చిన లోకేశ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారు. కొన్నినెలల కిందట గుంటూరు జిల్లా నరసరావుపేటలో అనూష హత్యకు గురైంది. ఆమె కుటుంబాన్ని పరామర్శించాలని లోకేశ్ భావించినా, పోలీసులు అడ్డుకోవడంతో చివరికి వీడియో కాల్ ద్వారా అనూష కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

Also Read:గన్నవరం విమానాశ్రయం వద్ద ఉద్రిక్తత... లోకేష్ ను చుట్టుముట్టిన పోలీసులు, వాగ్వాదం (వీడియో

అనంతరం నారా లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ.. సొంత చెల్లికి న్యాయం చేయలేని ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్రానికి ఏం చేస్తారని ప్రశ్నించారు. జగన్‌ పాలనలో సొంతింట్లో కూడా మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దిశ చట్టం కింద 21 రోజుల్లో నిందితులకు శిక్ష పడేలా చూస్తామన్నారు.. కానీ, 21 నెలలైనా నేరస్థులకు శిక్షపడట్లేదని లోకేశ్ ఎద్దేవా చేశారు. తాడేపల్లి, పులివెందుల సహా ఎక్కడా మహిళలకు భద్రత లేదని.. ఫిర్యాదు చేసేందుకు వెళ్తోన్న మహిళలపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని  లోకేశ్ ఆరోపించారు. జగన్‌ నివాసం సమీపంలో మహిళలపై ఎన్నో ఘోరాలు జరిగాయని లోకేశ్ దుయ్యబట్టారు.  నరసరావుపేటలో అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు నేను వెళ్తుంటే అంత భయమెందుకు అని లోకేశ్‌ ప్రశ్నించారు.  
 

click me!