అయోధ్య ఆలయ నిర్మాణ సేకరణ యాత్ర రథం ప్రారంభం..

Published : Jan 26, 2021, 10:56 AM IST
అయోధ్య ఆలయ నిర్మాణ సేకరణ యాత్ర రథం ప్రారంభం..

సారాంశం

అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి చందాల సేకరణ కోసం రథయాత్రను మంగళవారం ఉదయం ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు విజయవాడలో ప్రారంభించారు. 

అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి చందాల సేకరణ కోసం రథయాత్రను మంగళవారం ఉదయం ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు విజయవాడలో ప్రారంభించారు. 

ఈ సందర్భంగా పాతూరి నాగభూషణం మాట్లాడుతూ...అయోధ్య రామాలయ నిర్మాణంలో అందరూ భాగస్వామ్యులు అవుతున్నారని తెలిపారు. ఈ రథం.. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తిరుగుతుందని చెప్పారు. 

పది రూపాయలు నుంచి వంద రూపాయల వరకు చందాలు అందిస్తున్నారన్నారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా రూ.1500కోట్లు నిధులు విరాళాల రూపంలో సేకరిస్తున్నట్లు చెప్పారు. వీటి ద్వారా అయోధ్య పరిసర ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి చేస్తారన్నారు. రామ మందిరం నిర్మాణంలో కుల, మతాలకు అతీతంగా అందరూ స్పందిస్తున్నారని పాతూరి నాగభూషణం పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

TTD: తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. బ్రహ్మోత్సవాల వేళ రూ. 300 టికెట్ల షెడ్యూల్ విడుద‌ల
AP Pensions: ఆంధ్ర‌ప్ర‌దేశ్ పెన్ష‌న్ల‌లో కీల‌క మార్పులు.. ఇక‌పై రెండు విధాలుగా డ‌బ్బులు