యజమానికే మస్కా కొట్టిన గుమస్తా.. 10 కిలోల బంగారంతో ఎస్కేప్.. !

Published : Apr 29, 2021, 10:09 AM IST
యజమానికే మస్కా కొట్టిన గుమస్తా.. 10 కిలోల బంగారంతో ఎస్కేప్.. !

సారాంశం

బంగారం షాపులో పనిచేసే ఓ గుమాస్తా యజమాని కళ్లుగప్పి రూ. 4.84 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో పరారయ్యాడు. విజయవాడలోని గవర్నర్ పేట లో జరిగిన ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. 

బంగారం షాపులో పనిచేసే ఓ గుమాస్తా యజమాని కళ్లుగప్పి రూ. 4.84 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో పరారయ్యాడు. విజయవాడలోని గవర్నర్ పేట లో జరిగిన ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గవర్నర్పేట జైహింద్ కాంప్లెక్స్ మొదటి అంతస్తులో మహావీర్ జైన్ అనే వ్యక్తి రాహుల్ జ్యువలరీ పేరుతో నగల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆయన దగ్గర రవితేజ, హర్ష అని ఇద్దరూ గుమాస్తాలుగా పని చేస్తున్నారు. 

అదే సముదాయంలోని ఐదవ అంతస్తులో యజమాని కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. కరోనా కారణంగా వ్యాపారం తక్కువగా జరుగుతుంది. అందుకే మహావీర్ జైన్ ఆభరణాలను ఇంట్లోనే ఉంచి కొనుగోలుదారులు వచ్చినప్పుడు వాటిని షాప్ కి తెప్పిస్తాడు.

ఆ తరువాత తిరిగి ఇంటికి పంపుతున్నాడు. మంగళవారం ఉదయం ఆభరణాలు తీసుకొచ్చేందుకు ఇద్దరు గుమస్తాలను యజమాని ఐదవ అంతస్తులోని తన ఇంటికి పంపాడు. అతని భార్య, కుమారుడు రెండు బ్యాగులో ఉన్న బంగారు ఆభరణాలను వారిద్దరికీ ఇచ్చి పంపారు. అనంతరం 11 గంటల తర్వాత ఆ ఆభరణాలను తిరిగి ఇద్దరు గుమాస్తాలు యజమాని ఇంటికి వెళ్లి ఇచ్చి వచ్చారు.

కాగా మహావీర్ సోదరుడు ఇటీవల కోవిడ్ బారినపడి స్థానికంగా ఉన్న ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతన్ని చూసి వచ్చేందుకు 11 గంటల సమయంలో షాపు నుంచి ఆస్పత్రికి వెళ్లాడు మహావీర్. అదే అదనుగా భావించిన గుమస్తా హర్ష పన్నెండున్నర గంటల సమయంలో యజమాని ఇంటికి వెళ్లి ఆభరణాలు అడిగాడు. 

ఎప్పటిలాగే కొనుగోలుదారులకు చూపడానికే అనుకుని మహావీర్ భార్య, అతని కుమారుడు తిరిగి రెండు బ్లాగుల్లో ఉన్న ఆభరణాలను హర్ష చేతికి అందజేశారు. రెండు బ్యాగులతో కిందికి వచ్చిన హర్ష దుకాణానికి వెళ్లకుండా వాటితో ఉడాయించాడు.

విశాఖలో మరో విషాదం... కరోనాతో 14 ఏళ్ల బాలిక మృతి...

ఆస్పత్రికి వెళ్లిన మహావీర్ సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు. బుధవారం యధావిధిగా దుకాణం తెరిచి ఆభరణాల కోసం ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. కంగుతిన్న బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

బంగారం దుకాణంలో ఏడాదికాలంగా పని చేస్తున్న హర్ష విజయవాడకు చెందిన వాడేనని పోలీసులు గుర్తించారు. ఆభరణాలు అపహరించే ముందు హర్ష తనకు సంబంధించిన ఆధారాలు దుకాణంలో లేకుండా జాగ్రత్త పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఘటన విషయం తెలిసిన వెంటనే నగర సీపీ బత్తిన శ్రీనివాసులు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్