గల్ఫ్‌ ఏజెంట్ మోసం.. ఫ్లైట్‌ ఎక్కకుండానే అరెస్ట్, పోలీసుల అదుపులో 30 మంది కోనసీమ జిల్లా మహిళలు

By Siva KodatiFirst Published Aug 30, 2022, 4:25 PM IST
Highlights

గల్ఫ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ ఏజెంట్ చేసిన మోసంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన 30 మంది మహిళలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఫ్లైట్ ఎక్కకుండా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

నకిలీ వీసాలతో గల్ఫ్ ఏజెంట్ల చేతిలో అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన 30 మంది మహిళలు మోసపోయారు. ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్ అయిన బాధిత మహిళలు.. కేరళలోని ఎర్నాకుళంలో చిక్కుకుని మూడు నెలలుగా ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. మస్కట్‌లో ఉద్యోగాల పేరుతో గల్ఫ్ ఏజెంట్‌గా పనిచేస్తున్న తాళ్ల రాంబాబు అనే వ్యక్తి చేసిన మోసం ఆలస్యంగా వెలుగలోకి వచ్చింది. మే 5న 30 మంది మహిళలను మస్కట్‌ పంపేందుకు యత్నించాడు రాంబాబు. అయితే వాటిని నకిలీ వీసాలుగా గుర్తించిన అధికారులు ఎర్నాకులం ఎయిర్‌పోర్ట్‌లో మహిళలను అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

click me!