రెండేళ్లు చిన్న వ్యక్తితో వివాహేతర సంబంధం.. ఇంట్లో ఒప్పుకోలేదని ఇద్దరూ ఆత్మహత్య...

Published : Aug 30, 2022, 11:03 AM IST
రెండేళ్లు చిన్న వ్యక్తితో వివాహేతర సంబంధం.. ఇంట్లో ఒప్పుకోలేదని ఇద్దరూ ఆత్మహత్య...

సారాంశం

పెళ్లైన ఇద్దరు వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. దీనికి వారి కుటుంబాలు అభ్యంతరం చెప్పడంతో ఆత్మహత్య చేసుకున్నారు. 

శ్రీకాకుళం : వివాహేతర సంబంధం రెండు ప్రాణాలను బలి తీసుకుంది. ఆయా కుటుంబాలలో చిన్నాభిన్నం చేసింది. అభం శుభం తెలియని చిన్నారులకు పెద్ద దిక్కు లేకుండా చేసింది. రణస్థలం మండలం జేఆర్ పురం పంచాయతీ దండనపేటకు చెందిన పొగిరి సీతమ్మ (32), అల్లివలస గ్రామానికి చెందిన దుమ్ము అమ్మోరు(30) ఆదివారం రాత్రి ఒకే ఇంట్లో విగతజీవులుగా పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

సీతమ్మ భర్త అనారోగ్యంతో 2013లో మృతి చెందాడు. కుటుంబ పోషణ నిమిత్తం ఆమె జేఆర్ పురం కూడలిలో కూరగాయల దుకాణం నిర్వహిస్తుంది. ఇదే సమయంలో అల్లివలస గ్రామానికి చెందిన దుమ్ము అమ్మోరు తన బంధువులతో కలిసి జేఆర్ పురంలోనే ఓ హోటల్, లాడ్జి లీజుకు తీసుకుని నడిపేవాడు. స్థానికంగా వెంకటేశ్వర కాలనీలోనే కుటుంబంతో సహా నివాసం ఉండేవాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది.

భార్య వివాహేతర సంబంధం.. కొడుకులతో కలిసి వ్యక్తిని హత్య చేసిన భర్త...

కరోనా సమయంలో ఇద్దరి వ్యాపారాలు సాగక ఇంటివద్దే ఉండిపోయారు. కరోనా తగ్గిన తర్వాత సీతమ్మ గ్రామంలోని ఇంటి సమీపంలో కూరగాయల దుకాణం ఏర్పాటు చేసుకుంది. అమ్మోరు వ్యాపారం నడవలేక, మరొకరికి ఇచ్చేసి  విశాఖ స్టీల్ ప్లాంట్ పరిసరాల్లో కళ్లద్దాలు విక్రయించేందుకు వెళ్ళిపోయాడు. అయితే అతను వెళ్ళిపోయినా అతనితో సంబంధం మాత్రం కొనసాగిస్తుండడంతో సీతమ్మను కుటుంబసభ్యులు తరచూ మందలిస్తూ ఉండేవారు.

ఈ క్రమంలో అమ్మోరు ఆదివారం రాత్రి సీతమ్మ ఇంటికి వచ్చాడు.  ఆ రాత్రి ఏం జరిగిందో, ఏమో…తెల్లారేసరికి ఇద్దరూ విగతజీవులుగా కనిపించారు. ఇంట్లోనే ఉన్న ఈ విషయమే అతనికి తెలియలేదు. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో సీతమ్మ మామ వచ్చి తలుపు తట్టాడు. ఎవరు తీయకపోవడంతో మళ్లీ గట్టిగా కొట్టాడు. ఆ శబ్దానికి మనవడు లేచివచ్చి తలుపు తీశాడు. లోపలికి వెళ్లి చూడగా  ఇద్దరూ చనిపోయి కనిపించారు. వెంటనే ఈ విషయం చుట్టుపక్కల వారికి పోలీసులకు తెలియజేశాడు.

మృతుడి భార్య, ఏడాది కుమార్తె, నాలుగు నెలల వయసున్న కుమారుడు ఉన్నారు. మృతురాలికి ఒక కుమారుడు ఉండగా అతను ఆరో తరగతి చదువుతున్నాడు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు.  జె ఆర్ పురం ఎస్సై రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో ఉన్న ఆధారాలను సేకరించారు.

 వారి ఇష్టం లేకపోవడంతోనే…
‘నేను సీతమ్మ తో కలిసి ఉండడం వారి కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. దీంతో ఇతర ఆత్మహత్య చేసుకుంటున్నాం. పిల్లలను బాగా చూసుకోవాలి’ అని కుటుంబ సభ్యులను కోరుతూ రాసిన ఓ లేఖ అమ్మోరు చొక్కా జేబులో నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  సీతమ్మ మెడ వద్ద చిన్న గాయమై.. నోటివెంట నురగ వస్తుండగా..  అమ్మోరు మాత్రం తాడుతో పంకాకు ఉరేసుకుని వేలాడుతున్నాడు. సీతమ్మ మృతి అనుమానాస్పదంగా ఉండటంతో ఇతర కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం