కుప్పంలో అన్న క్యాంటీన్ ను ధ్వంసం చేసిన దుండగులు.. అర్థరాత్రి అరాచకం...

Published : Aug 30, 2022, 12:44 PM IST
కుప్పంలో అన్న క్యాంటీన్ ను ధ్వంసం చేసిన దుండగులు.. అర్థరాత్రి అరాచకం...

సారాంశం

కుప్పంలో అన్న క్యాంటీన్ ను గుర్తు తెలియని దుండగులు కూల్చేశారు. సోమవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. 

కుప్పం :  చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో టిడిపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ లో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.  ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక క్యాంటీన్ పై సోమవారం అర్ధరాత్రి దాడి చేశారు,  అక్కడ ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉన్న బ్యానర్లను సెండ్ చేశారు.  షామియానా లను కూడా ధ్వంసం చేశారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా వైసిపి టిడిపి వర్గాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. 

వైసీపీ శ్రేణులు పట్టణంలో ర్యాలీ నిర్వహించిన సందర్భంలో అన్నా క్యాంటీన్ ను ధ్వంసం చేశారు. మళ్లీ దానిని పునరుద్దరించారు. ఇప్పుడు దుండగులు దాడి చేశారు మరోవైపు పట్టణంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద చంద్రబాబు వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. 

చంద్రబాబు కుప్పానికి వచ్చిన ప్రతీసారి బ్లాక్ డే.. 33 ఏళ్లు అక్కడి ప్రజలకు ఏం చేశారు?: మంత్రి పెద్దిరెడ్డి

ఇదిలా ఉండగా, ఆగస్ట్ 25నాడు కుప్పంలో రెండో రోజు టిడిపి అధినేత నారా చంద్రబాబు పర్యటనతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వైసిపి నేతలు, కార్యకర్తలు చంద్రబాబు ప్రారంభించాల్సిన అన్న క్యాంటీన్ ను ధ్వంసం చేశారు. దీనిమీద చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రగా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి అన్న క్యాంటీన్ కు వరకు వచ్చారు. వైసిపి నేతల చర్యలకు నిరసనగా....అన్న క్యాంటీన్ వద్ద రోడ్డుపై బైఠాయించి చంద్రబాబునాయుడు నిరసన వ్యక్తం చేశారు. 

అనంతరం మాట్లాడుతూ ఈ రోజు కుప్పం చరిత్రలో ఒక చీకటి రోజని అన్నారు. అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ను ధ్వంసం చెయ్యడం నీచం అని, వీధి కొక రౌడీని తయారు చేసి ప్రజలపైకి ఉసిగొల్పుతున్నారన్నారు. పోలీసులు సరిగా ఉండి ఉంటే అన్న క్యాంటీన్ ను ఇలా ద్వంసం చేసేవారా? ఎస్పీ ఎక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? అని ప్రశ్నించారు.  మా వాళ్లు కూడా దాడులకు దిగితే ఏం చేస్తారు అని ఎదురుప్రశ్నించారు. మీకు 60 వేల మంది పోలీసులు ఉంటే మాకు 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు.పక్కనే పోలీస్ స్టేషన్ ఉన్నా దాడి చేశారు. మరి పోలీసులు ఏం చేస్తున్నారు.

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా? పోలీసులు ఉంది మాపై దాడులు చెయ్యడానికా? అన్న క్యాంటీన్ పై దాడి చేసిన వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లకుండా ఇంటికి తీసుకువెళతారా? మూడేళ్లుగా జరుగుతున్న గ్రానైట్ అక్రమాలను ప్రశ్నించి అడ్డుకున్నాం.బియ్యం అక్రమ రవాణాను అడ్డుకున్నాం. మూడేళ్లలో అనేక చోట్ల నా పర్యటనలకు అడ్డంకులు సృష్టించారు. కోర్టు కూడా చీవాట్లు పెట్టింది. అప్పుడే పోలీసు వ్యవస్థ చచ్చిపోయింది. మా ఇంటికి వచ్చిన రౌడీలకు ప్రమోషన్ ఇచ్చి జగన్ మంత్రులను చేశాడు.దాడులు చేసి భయపెట్టి గెలవాలి అనుకుంటున్నారు. ఇలాంటి దాడులకు టిడిపి భయపడేది లేదు అన్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం