నెల్లూరులో రోడ్డు ప్రమాదం: గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌కి తప్పిన ముప్పు

Published : Oct 13, 2020, 10:29 AM IST
నెల్లూరులో రోడ్డు ప్రమాదం: గూడూరు ఎమ్మెల్యే  వరప్రసాద్‌కి తప్పిన ముప్పు

సారాంశం

నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ ప్రయాణీస్తున్న కారు సోమవారం నాడు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుండి ఎమ్మెల్యే సురక్షితంగా బయటపడ్డారు. గాయపడిన ఎమ్మెల్యేను చికిత్స నిమిత్తం చెన్నైకి తరలించారు.


నెల్లూరు: నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ ప్రయాణీస్తున్న కారు సోమవారం నాడు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుండి ఎమ్మెల్యే సురక్షితంగా బయటపడ్డారు. గాయపడిన ఎమ్మెల్యేను చికిత్స నిమిత్తం చెన్నైకి తరలించారు.

చెన్నై నుండి కారులో గూడూరుకు వస్తున్న సమయంలో ఇవాళ నాయుడుపేట వద్ద ఎమ్మెల్యే ప్రయాణీస్తున్న కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ హరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎమ్మెల్యే వరప్రసాద్ కి స్వల్పగాయాలయ్యాయి.

ఈ క్రమంలో హరిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్యే వరప్రసాద్ ను చికిత్స నిమిత్తం చెన్నైకి తరలించారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే కారు ముందు  భాగం నుజ్జునుజ్జయింది. ఎమ్మెల్యే ప్రయాణీస్తున్న కారుకు ముందు భాగంలో వెళ్తున్న లారీ డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. 

ఈ ప్రమాదంతో  రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఎమ్మెల్యేతో పాటు, డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.


 

PREV
click me!

Recommended Stories

చిన్నపిల్లలు నవ్వుతున్నారు Jagan ఐదేళ్లు CMగా ఉన్నప్పుడు మావిగన్ గుర్తు రాలేదా?| Asianet News Telugu
జగన్ మావిగన్ కామెంట్స్‌పై యార్లగడ్డ సెటైర్లు | Yarlagadda Venkata Rao | Asianet News Telugu