ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు విషయం రాజకీయ దుమారం రేపుతున్నది. వెయ్యి మంది బాలకృష్ణలు, వెయ్యి మంది చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్‌ను ఏమీ చేయలేరని మండిపడ్డారు.
Kodali Nani: టీడీపీ చీఫ్ చంద్రబాబులు, సినీ నటుడు, టీడీపీ లీడర్ బాలకృష్ణలపై గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ తొలగింపు వివాదాస్పదమైంది. ఈ అంశంపై కొడాలి నాని స్పందిస్తూ చంద్రబాబు, బాలకృష్ణలపై మండిపడ్డారు. వెయ్యి మంది బాలకృష్ణలు, వెయ్యి మంది చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్‌ను ఏమీ చేయలేరని అన్నారు.
ఈ రోజు ఎన్టీఆర్ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించడానికి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు ఆయన వారసులు వచ్చారు. సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చారు. వారు వస్తున్నారని తెలిసి అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కట్టారు. ఆ తర్వాత బాలకృష్ణ వచ్చారు. అక్కడే ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు చూశారు. ఆ ఫ్లెక్సీలను తొలగించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాకు ఎక్కింది.
ఈ ఫ్లెక్సీల తొలగింపు విషయంపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఫైర్ అయ్యారు. చంద్రబాబు తనయుడు లోకేశ్ కోసమే జూనియర్ ఎన్టీఆర్‌ను సర్వనాశనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు చేశారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఫ్లెక్సీలతో వారికి ఏం నష్టం వాటిల్లిందని ప్రశ్నించారు. వాళ్లది నీచాతినీచమైన బుద్ధి అని ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎన్టీఆర్ వర్ధంతి చేస్తారా? అంటూ ఫైర్ అయ్యారు. అంతేకాదు, వెయ్యి మంది బాలకృష్ణలు, వెయ్యి మంది చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్‌ను ఏమీ చేయలేరని పేర్కొన్నారు.
Also Read : Bihar: మొబైల్ దొంగిలిస్తుండగా పట్టుకున్న ప్రయాణికులు.. ట్రైన్ కిటికీ నుంచి వేలాడిదీసిన వీడియో వైరల్
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడ పొలిటికల్ టెన్షన్ నెలకొంది. టీడీపీ, వైసీపీలు పోటాపోటీగా ఎన్నటీఆర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.