కేశినేని నానిని జగన్ కూడా తన్ని తరిమేయడం ఖాయం..: బుద్దా వెంకన్న

Published : Jan 18, 2024, 01:47 PM ISTUpdated : Jan 18, 2024, 01:54 PM IST
కేశినేని నానిని జగన్ కూడా తన్ని తరిమేయడం ఖాయం..: బుద్దా వెంకన్న

సారాంశం

విజయవాడ ఎంపీ కేశినేని నాని టిడిపిలో వుండి వైసిపి కోవర్టుగా వ్యవహరించాడని బుద్దా వెంకన్న ఆరోపించారు.  గతంలో చిరంజీవి, ఇప్పుడు చంద్రబాబు తరిమేసినట్లే భవిష్యత్ లో జగన్ కూడా నానిని తన్ని తరిమేస్తాడని అన్నారు. 

విజయవాడ : తెలుగుదేశం పార్టీని వీడి ఇటీవలే వైసిపిలో చేరిన విజయవాడ ఎంపీ కేశినేని నానిపై బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో  విరుచుకుపడ్డారు. టిడిపిలో వుంటూనే వైసిపికి కోవర్టుగా నాని పనిచేసాడని ఆరోపించారు. ఆయన పచ్చి మోసగాడు, దుర్మార్గుడు ... అతడికి ఎన్నికల్లోనే తగిన బుద్ది చెబుతామని వెంకన్న హెచ్చరించారు.  

టిడిపి వ్యవస్థాపకులు, మాజీ సీఎం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకన్నతో పాటు కేశినేని చిన్ని, నాగుల్ మీరా తదితర నాయకులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన తర్వాత వీరు మాట్లాడారు. 
 
ముందుగా వెంకన్న మాట్లాడుతూ... గత ఎన్నికలకు ముందుసుండే నాని వైసిపి కోసం పనిచేస్తున్నాడని ఆరోపించారు. 2017లో దేవినేని అవినాష్ టిడిపిలో చేరేందుకు సిద్దమయితే వద్దని చెప్పిన దద్దమ్మ ఈ నానినే అని అన్నారు. ఇలా టిడిపిలో వుంటూనే ద్రోహం చేసాడని ... ఇలాంటి నాయకుడు పార్టీని వీడటమే మంచిదయ్యిందని వెంకన్న అన్నారు.

టిడిపిలో అందరూ అవినీతిపరులే వున్నారని నాని అంటున్నాడు... వాళ్లెవరో దమ్ముంటే బయటపెట్టాలని వెంకన్న సవాల్ చేసారు. కాంట్రాక్టర్ వద్ద డబ్బులు వసూలు చేసిన చరిత్ర నానిది... ఇది నిజంకాదని చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు. ఇలా టిడిపిలో ఎవరు ఏ అవినీతికి పాల్పడ్డారో చెప్పగలవా? అంటూ ప్రశ్నించారు. 

Also Read  ముఖ్యమంత్రులైనంత మాత్రాన తప్పించుకోలేరు... : అంబటి సంచలన వ్యాఖ్యలు

గతంలో ప్రజారాజ్యం పార్టి నుండి చిరంజీవి బయటకు గెంటేస్తే నాని టిడిపి పంచన చేరాడని వెంకన్న అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మెడపట్టుకుని బయటకు గెంటేస్తే వైసిపిలో చేరాడన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కూడా నానిని కాలితో తన్ని తరిమేయడం ఖాయమని వెంకన్న అన్నారు.

టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరిన నాని ఉమ్మడి కృష్ణా జిల్లాలో టిడిపిని ఖాళీ చేస్తానన్నాడు... ఏమయ్యింది? అని అడిగారు. 60% శాతం టిడిపి నాయకులను వైసిపిలోకి తీసుకెళతానని కనీసం ఆరుగురిని కూడా తీసుకెళ్ళలేకపోయాడని ఎద్దేవా చేసారు. ఇంకా ఎంపీ కానేలేదు... కానీ కేశినేని చిన్ని విజయవాడ నగర వైసిపి అధ్యక్షుడు భప్పన భవన్ కుమార్ ను టిడిపిలోకి తీసుకువచ్చాడని వెంకన్న పేర్కొన్నారు. 

కేశినేని నాని పని ఇంకా అయిపోలేదు... ఆయనకు ముందుంది ముసళ్ల పండగ అంటూ వెంకన్న హెచ్చరించారు. విజయవాడ పార్లమెంట్ లో కేశినేని నానిని చిత్తుచిత్తుగా ఓడించి తీరతామని సవాల్ చేసారు. విజయవాడలో టిడిపి జెండా ఎగరేస్తామని బుద్దా వెంకన్న ధీమా వ్యక్తం చేసారు.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IAS Amrapali Kata Speech: విశాఖ ఉత్సవ్ లో ఆమ్రపాలి పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu
Visakha Utsav Curtain Raiser Event: హోం మంత్రి అనిత సెటైర్లు | Asianet News Telugu