లంచం తీసుకొంటూ చిక్కిన జీఎస్టీ సూపరింటెండ్: అరెస్ట్ చేసిన సీబీఐ

By narsimha lode  |  First Published Dec 11, 2021, 3:17 PM IST

సకాలంలో పన్నులు చెల్లించని వ్యాపారుల నుండి లంచం వసూలు చేస్తున్న  జీఎస్టీ సూపరింటెండ్ జాన్ మోషన్ ను సీబీఐ అధికారులు శనివారం నాడు అరెస్ట్ చేశారు. 


విజయవాడ: విజయవాడ జీఎస్టీ సూపరింటెండ్ లంచం తీసుకొంటుండగా అధికారులు శనివారం నాడు అరెస్ట్ చేశారు. సకాలంలో పన్నులు చెల్లించని వ్యాపారుల నుండి జీఎస్టీ సూపరింటెండ్ం జాన్ మోషన్ లంచం డిమాండ్ చేశాడు. ఈ విషయమై వ్యాపారులు CBI  అధికారులకు ఫిర్యాదు చేశారు. వ్యాపారుల నుండి లంచం తీసుకొంటున్న జీఎస్టీ సూపరింటెండ్ జాన్ మోషన్ ను అరెస్ట్ చేశారు. గతంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే తరహ ఘటన చోటు చేసుకొంది. 

also read:హైద్రాబాద్‌ జీఎస్టీ ఆఫీస్‌లో సీబీఐ సోదాలు: లంచం తీసుకొన్న ఇద్దరి అరెస్ట్

Latest Videos

undefined

హైద్రాబాద్ నగరంలోని బషీర్ బాగ్ లో గల Gst కార్యాలయంలోని గల Customs  యాంటీ విస్సన్ వింగ్ లో పనిచేస్తున్న ఇద్దరు అధికారులనుCbi ఈ ఏడాది అక్టోబర్ 26న అరెస్ట్ చేసింది. ఓ వ్యాపారి నుండి లంచం తీసుకొన్నారని వీరిద్దరిని సీబీఐ అరెస్ట్ చేసింది.కస్టమ్స్  యాంటీ విస్సన్ వింగ్ లో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్ కిషన్ పాల్, సూపరిండెంట్ సురేష్ కుమార్‌లను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ ఇద్దరు అధికారులకు రూ. 20 వేలు లంచం ఇచ్చి సీబీఐకి ఫిర్యాదు చేశాడు బాధితుడు మీర్ అస్ఘర్. ఈ ఇద్దరు అధికారులు లంచం తీసుకొంటున్న సమయంలో సీబీఐ అధికారులు  దాడులు నిర్వహించారు.ఈ దాడుల తర్వాత  Kishan paul , Suresh లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించింది సీబీఐ. వీరిద్దరూ లంచం తీసుకొన్నారని సీబీఐ నిర్ధారణ చేసుకొంది. దీంతో మంగళవారం నాడు నిందితులను అరెస్ట్ చేసింది.హైకోర్టు ఆదేశాలతో విడుదలైన వ్యక్తి నుండి ఈ ఇద్దరు అధికారులు లంచం తీసుకొన్నారని సీబీఐ చెబుతుంది.

 

click me!