రూ. 1.30 లక్షల లంచం: ఏసీబీకి చిక్కిన ఒంగోలు జీఎస్టీ అధికారులు

By narsimha lodeFirst Published Feb 12, 2021, 5:50 PM IST
Highlights

లంచం తీసుకొంటూ జీఎస్టీ అధికారులు  ఏసీబీకి చిక్కారు. రూ. 1.30 లక్షలు లంచం తీసుకొంటూ జీఎస్టీ అధికారులు ఏసీబీకి శుక్రవారం నాడు చిక్కారు.
 

ఒంగోలు: లంచం తీసుకొంటూ జీఎస్టీ అధికారులు  ఏసీబీకి చిక్కారు. రూ. 1.30 లక్షలు లంచం తీసుకొంటూ జీఎస్టీ అధికారులు ఏసీబీకి శుక్రవారం నాడు చిక్కారు.తమ పనులు చేయాలని వచ్చిన వారిని జీఎస్టీ అధికారులు లంచం కోరారు. బాధితులు ఈ విషయమై ముందుగానే ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు.

ఈ సమాచారం ఆధారంగా ఇవాళ లంంచం తీసుకొంటుండగా జీఎస్టీ అధికారులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెండ్ గా పట్టుకొన్నారు. ఏసీటీవో శ్రీనివాసరావు, జూనియర్ అసిస్టెంట్ నాగేశ్వరరావు, అటెండర్ రఫీలు ఏసీబీకి చిక్కారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో లంచం తీసుకొంటూ పలువురు ప్రభుత్వ ఉద్యోగులు  చిక్కుతున్నారు.  లక్షలాది రూపాయాలు లంచం తీసుకొంటూ ఏసీబీకి దొరుకుతున్నారు. 
 

click me!