ఇస్రో మరో విజయం.. జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-12 ప్రయోగం విజయవంతం..

By Sumanth KanukulaFirst Published May 29, 2023, 10:54 AM IST
Highlights

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సోమవారం ఉదయం జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-12 రాకెట్‌ను ప్రయోగించింది. 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ఘనత సొంతం చేసుకుంది. జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-12 రాకెట్‌ను ప్రయోగం విజయవంతం అయింది. శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నిర్దేశించిన సమయం ఉదయం 10.42 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-12 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-12 రాకెట్..  2,232 కిలోల బరువు కలిగిన ఎన్‌వీఎస్-01 ఉపగ్రహాన్ని రోదసిలోకి తీసుకెళ్లింది. ఎన్‌వీఎస్-01 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. ఇందుకు సంబంధించి ఇస్రో కూడా ప్రకటన చేసింది. దాదాపు 19 నిమిషాల ప్రయాణం తర్వాత.. ఎన్‌వీఎస్-O1 ఉపగ్రహం ఖచ్చితంగా జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టబడిందని ఇస్రో పేర్కొంది. 

 

GSLV-F12/ NVS-O1 Mission is accomplished.

After a flight of about 19 minutes, the NVS-O1 satellite was injected precisely into a Geosynchronous Transfer Orbit.

Subsequent orbit-raising manoeuvres will take NVS-01 into the intended Geosynchronous orbit.

— ISRO (@isro)

ఇక, భారత్‌కు చెందిన రెండో తరం నావిక్ ఉపగ్రహాల్లో ఎన్‌వీఎస్-01 మొదటిది.  ఇండియయన్ రీజినల్ నావిగేషన్ సిస్టంను మరింత బలోపేతం చేసేందుకు ఎన్‌వీఎస్-01 పేరుతో నావిగేషన్ ఉపగ్రహ ప్రయోగాన్ని చేపట్టారు. ఎన్‌వీఎస్-01 ఉగ్రహం.. ఎల్-5, ఎస్- బాండ్ సిగ్నల్స్‌లతో పనిచేసే విధంగా రూపొందించారు. దీని జీవితకాలం 12 ఏళ్లు. 

click me!