ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. కారు, ఆర్టీసీ బస్సు ఢీ.. నలుగురు దుర్మరణం..

Published : May 29, 2023, 10:40 AM IST
ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. కారు, ఆర్టీసీ బస్సు ఢీ.. నలుగురు దుర్మరణం..

సారాంశం

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతిచెందారు. 

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఆదివారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు.. విజయవాడ నుంచి హిందూపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు, గుంటూరు వైపు వెళ్తున్న కారు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రమాద స్థలంలోనే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని వినుకొండ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు విడిచారు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. మరో ఇద్దరికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది. 

ఈ ప్రమాదంలో మృతిచెందినవారిని విజయవాడకు చెందిన సాయి, పిల్లి శ్రీనివాస్‌, చంద్రశేఖర్‌, కె శ్రీనులుగా గుర్తించారు. వీరంతా అనంతపురంలో ఒక పెళ్లి మండపం డెకరేషన్‌ కోసం వెళ్లి విజయవాడ వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇక, బస్సులో ప్రయాణిస్తున్న కొంతరికి కూడా స్పల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Independence Day 2026 : చంద్రబాబు బిగ్ అనౌన్స్‌మెంట్.. ఇకపై మీ ఇంటి ఖర్చులు పెరగవు
స్వాతంత్య్ర వేడుకల్లో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్ | Pawan Kalyan Speech Independence Day 2026