చిత్తూరు జిల్లాలో విషాదం: కరోనాతో నవ వరుడు మృతి

By narsimha lodeFirst Published Aug 20, 2020, 12:13 PM IST
Highlights

కరోనా ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నిలిపింది. పెళ్లైన 10 రోజుల్లోనే నవ వరుడు కరోనాతో మరణించాడు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

చిత్తూరు: కరోనా ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నిలిపింది. పెళ్లైన 10 రోజుల్లోనే నవ వరుడు కరోనాతో మరణించాడు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకొంది.చిత్తూరు జిల్లాలోని వి. కోట మండలం నెర్నిపల్లిలో కరోనా సోకి నవ వరుడు గురువారం నాడు మరణించాడు.

నెర్నిపల్లిలో పది రోజుల క్రితమే ఆ యువకుడికి పెళ్లి జరిగింది.ఈ పెళ్లి జరిగిన తర్వాత యువకుడికి కరోనా ఉన్నట్టుగా తేలింది. దీంతో చికిత్స కోసం ఆయన బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు.

also read:సిరో సర్వైలెన్స్ షాకింగ్ సర్వే: విజయవాడలో 40.51 శాతం మందికి కరోనా.. రికవరీ..!

ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవ వరుడు గురువారం నాడు మరణించాడు.  పెళ్లై పది రోజుల్లోనే  కరోనాతో వరుడు మరణించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం నాటికి  కరోనా కేసులు 3,16,003కి చేరుకొన్నాయి. రాష్ట్రంలో కరోనాను కట్టడి చేసేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.  గతంలో కర్నూల్ జిల్లాలో అత్యధికంగా కేసులు ఉండేవి. కర్నూల్ జిల్లాను దాటేసి తూర్పు గోదావరి జిల్లా కరోనా కేసుల్లో దూసుకెళ్తోంది. 

click me!