సిరో సర్వైలెన్స్ షాకింగ్ సర్వే: విజయవాడలో 40.51 శాతం మందికి కరోనా.. రికవరీ..!

By narsimha lode  |  First Published Aug 20, 2020, 11:20 AM IST

 కరోనా వైరస్ ఎప్పుడు ఎలా వ్యాప్తి చెందుతోందో అంతు బట్టడం లేదు. పలు అధ్యయనాల్లో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  సిరో సర్వైలెన్స్ నిర్వహించిన  సర్వే షాకింగ్ విషయాలను బయటపెట్టింది. 


విజయవాడ: కరోనా వైరస్ ఎప్పుడు ఎలా వ్యాప్తి చెందుతోందో అంతు బట్టడం లేదు. పలు అధ్యయనాల్లో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  సిరో సర్వైలెన్స్ నిర్వహించిన  సర్వే షాకింగ్ విషయాలను బయటపెట్టింది. రాష్ట్రంలో 40.51 శాతం మందికి కరోనా సోకడంతో పాటు కరోనా నుండి కూడ రికవరీ అయినట్టుగా ఈ సర్వే నివేదిక తేల్చింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం నాటికి  కరోనా కేసులు 3,16,003కి చేరుకొన్నాయి. రాష్ట్రంలో కరోనాను కట్టడి చేసేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. 

Latest Videos

undefined

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, ఇన్‌ఫెక్షన్ సోకిన వారి ఎంతమంది ఉన్నారనే విషయాన్ని గుర్తించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ సిరో సర్వైలెన్స్ సంస్థ సర్వే నిర్వహించింది. 


కృష్ణా జిల్లాలోని రాణిగారితోటలో 40 మందిలో 29 మందికి, కృష్ణలంకలో 39 మందిలో 16 మందికి  కరోనా సోకి తగ్గినట్టుగా ఈ సర్వేలో తేలింది. లంబడిపేటలో 38.18, రామలింగేశ్వరనగర్ లో 43.18, దుర్గాపురంలో 43.17, గిరిపురంలో 33.18, ఎన్టీఆర్ కాలనీలో 43.16, ఆర్ఆర్ పేటలో 40.16 మంది నమూనాలు పరీక్షిస్తే అయిదుగురిలో యాంటీబాడీలు వృద్ధి చెందినట్టుగా ఈ సర్వేలో తేలింది.

ఆగష్టు 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు సిరో సర్వైలెన్స్  నిర్వహించిన సర్వేలో కీలక విషయాలు వెలుగు చూశాయి. విజయవాడలో 1.80 లక్షల మందికి పరీక్షలు చేస్తే  6 వేల మందికి కరోనా సోకిందని ఈ సర్వే తేల్చింది. 

also read:సీసీఎంబీ షాకింగ్ సర్వే: హైద్రాబాద్ మురుగునీటిలో కరోనా ఆనవాళ్లు

కరోనా అనుమానిత లక్షణాలు లేకుండానే పలువురికి కరోనా సోకి రికవరీ అయినట్టుగా ఈ సర్వే తేల్చి చెప్పింది. ఇంకా 3.3 శాతం మంది రక్త నమూనాలను ఇంకా పరీక్షించాల్సి ఉందని అధికారులు చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలోని హైద్రాబాద్ లో మురుగునీటిలో కరోనా ఆనవాళ్లను సీసీఎంబీ గుర్తించింది.  హైద్రాబాద్ లోని  పలు మురుగు నీటి శుద్ది కేంద్రాల నుండి నీటి నమూనాలను సేకరించి ఈ పరీక్షలు నిర్వహించినట్టుగా సీసీఎంబీ డైరెక్టర్ ప్రకటించారు.
 

click me!