టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. నెలలోపు ప్రక్రియ పూర్తి...

By SumaBala BukkaFirst Published Dec 10, 2022, 9:31 AM IST
Highlights

ఏపీలో టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రక్రియ ఈ నెల 12నుంచి మొదలై వచ్చేనెల 12కు ముగియనుంది. 

అమరావతి : టీచర్ల బదిలీలకు ఏపీ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు గ్రేడ్-2 హెడ్ మాస్టర్లు, టీచర్లకు బదిలీల షెడ్యూల్ విడుదల చేసింది. ఒకే చోట ఐదేళ్లు పూర్తి చేసుకున్న హెడ్ మాస్టర్లకు, ఎనిమిదేళ్ల పూర్తి చేసుకున్న టీచర్లకు బదిలీ తప్పనిసరి చేసింది. ఈ బదిలీల ప్రక్రియ ఈ నెల 12 నుంచి ఆన్ లైన్ లో ప్రారంభమవుతుంది. నెల రోజుల్లో ప్రక్రియ పూర్తవుతుంది. వచ్చే నెల 12న బదిలీల తుది జాబితా విడుదల అవుతుంది. మున్సిపల్ టీచర్లకు ఈసారి బదిలీలకు నో చాన్స్.

ఈ మేరకు మంత్రి బొత్స సత్యనారాయణ గురు శుక్రవారాల్లో వరుసగా సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల అనంతరమే బదిలీల నిర్ణయం తీసుకున్నారు. భార్యభర్తలు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ఇతరత్రా సర్వీసు, పాఠశాల స్టేషన్ పాయింట్లు గతంలోలాగానే ఉంటాయి. కాగా, స్కూళ్లలో సబ్జెక్టు పరంగా బోధించే టీచర్ల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు అనేక ఫిర్యాదులు అందాయి.  దీంతో తాత్కాలికంగా దీనికి సర్దుబాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 

తీరం దాటిన మాండూస్ తుఫాన్.. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాలు జలమయం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 3-10 తరగతులకు 6,578 మంది, 6-10 తరగతులకు 1,350మంది సబ్జెక్టు టీచర్లు అవసరమని ఓ అంచనా వేశారు.  దీని ప్రకారం టీచర్లను సర్దుబాటు చేయనున్నారు. ఒకవేళ వీరు అందుబాటులో లేకపోతే అర్హత ఉన్న ఎస్జిటిలను స్కూల్ అసిస్టెంట్లుగా నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. కొన్నిచోట్ల 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలకు తరలించారు. దీంతోపాటు అర్హత కలిగిన ఎస్జీటీలను ఆయా వేరు వేరు బడులకు పంపించారు. 

ఇప్పుడు బదిలీల కారణంగా వీరి పరిస్థితి ఎలా ఉండబోతుందనే దానిపై పెద్దగా స్పష్టత లేదు. సర్దుబాట్లు రద్దు చేసి.. అందరికీ ట్రాన్స్ ఫర్ అవకాశం ఇస్తారా? సర్దుబాటు చేసినవారికి ఏ పాయింట్లు ఇస్తేరనేది.. ఇప్పుడు ఉపాధ్యాయుల్లో ఆందోళన కలిగిస్తున్న అంశం. ఉపాధ్యాయుల బదిలీల తరువాత ఏర్పడే ఖాళీల్లో డీఎస్సీ-98 అభ్యర్థులకు పోస్టింగులు ఇవ్వనున్నారు.

టీచర్ల బదిలీల తర్వాత  జిల్లా విద్యా అధికారులకు బదిలీలు నిర్వహించనున్నారు.  రాష్ట్రంలో నాలుగు డీఈవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని జిల్లాల్లో కొత్త వారిని నియమించాలని నిర్ణయించారు.  

click me!