కొంపముంచిన వాస్తు....ముగ్గురు బలి

By Nagaraju TFirst Published Sep 26, 2018, 7:39 PM IST
Highlights

ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాస్తు బాగోలేదంటూ ఓ కంపెనీ నిర్మాణం పనులు ముగ్గురుని బలితీసుకోగా పదిమందిని ఆస్పత్రి పాల్జేసింది. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం నక్కబొక్కలపాడు గ్రామంలో ఉన్న రవి గ్రానైట్ పాలిషింగ్ ఫ్యాక్టరీ వాస్తు నిమిత్తం పైకి లేపేందుకు ప్రయత్నించారు. 

ప్రకాశం: ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాస్తు బాగోలేదంటూ ఓ కంపెనీ నిర్మాణం పనులు ముగ్గురుని బలితీసుకోగా పదిమందిని ఆస్పత్రి పాల్జేసింది. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం నక్కబొక్కలపాడు గ్రామంలో ఉన్న రవి గ్రానైట్ పాలిషింగ్ ఫ్యాక్టరీ వాస్తు నిమిత్తం పైకి లేపేందుకు ప్రయత్నించారు. 

రోడ్డు కంటే కిందకు కంపెనీ ఉండటంతో వాస్తు సరిగ్గా లేదని భావించిన యాజమాన్యం కంపెనీని పైకి ఎత్తేందుకు ప్లాన్ చేసింది. అందులో భాగంగా ముంబైకి చెందిన ఓ కంపెనీ ప్రతినిధుల సూచనలతో జాక్ ల ద్వారా కంపెనీని పైకి లెపేందుకు ప్రయత్నిస్తున్నారు. జాక్ లు సరిగ్గా అమరకపోవడంతో ఒక్కసారిగా షెడ్ కుప్పకూలిపోయింది. దీంతో కంపెనీలో పనిచేస్తున్న పూర్ణమ్మ, ఏసు మరియమ్మ అనే ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో పదిమంది శిథిలాల క్రింద చిక్కుకుపోయారు. 

సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రొక్లెయినర్ సహాయంతో శిధిలాల కింద చిక్కుకుపోయిన పదిమందిని బయటకు తీశారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం నరసరావుపేట, చిలకలూరిపేట, అద్దంకి ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. అయితే వెంకటేష్ అనే కార్మికుడు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. 
 
కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కంపెనీ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా పనులు చేపట్టారని పోలీసులు గుర్తించారు. అలాగే భద్రతా ప్రమాణాలను  పాటించడం లేదని పోలీసులు తెలిపారు. 

click me!