సైగ చేస్తే తన్ని తగలేస్తారు: చింతమనేనికి పవన్ హెచ్చరిక

Published : Sep 26, 2018, 05:37 PM ISTUpdated : Sep 26, 2018, 06:41 PM IST
సైగ చేస్తే తన్ని తగలేస్తారు: చింతమనేనికి పవన్ హెచ్చరిక

సారాంశం

రౌడీలు చట్టసభలకు వచ్చి పిచ్చివాగుడు వాగుతున్నారని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విమర్శించారు.

హైదరాబాద్: రౌడీలు చట్టసభలకు వచ్చి పిచ్చివాగుడు వాగుతున్నారని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విమర్శించారు.  పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో జనసేన పోరాటయాత్ర సందర్భంగా బుధవారం నాడు నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.

టీడీపీపై, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. బలమైన లా అండ్ ఆర్డర్ కావాలని  తాను సీఎంను కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై 27 కేసులున్నాయని ఆయన చెప్పారు.

చట్టసభల్లో ఎమ్మెల్యేలను క్రమశిక్షణగా ఉండేలా ప్రభుత్వ విప్ గా ఉన్న  చింతమనేని ప్రభాకర్ వ్యవహరించాలన్నారు. కానీ, చింతమనేని ప్రభాకర్ రౌడీగా వ్యవహరిస్తున్నాడని ఆయన చెప్పారు. ఆకు రౌడీలు, వీధి రౌడీలు, గల్లీ రౌడీగా చింతమనేని ప్రభాకర్ వ్యవహరిస్తున్నాడన్నారు.  కానీ, ఆయనపై చంద్రబాబునాయుడు  ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. 

2014 ఎన్నికలకు ముందు సీఎం సామాజికవర్గానికి చెందిన తన అభిమానులు  టీడీపీకి ఈ దఫా మద్దతు ఇవ్వాలని కోరినట్టు ఆయన గుర్తు చేశారు. బలమైన రాజకీయవ్యవస్థ కావాల్సిన  అవసరం ఉందన్నారు.

 జనసేన ఈ తరం యువత పార్టీ అని పవన్ కళ్యాణ్ చెప్పారు. గూండాయిజం...రౌడీయిజం చేస్తూ రాజకీయం చేస్తామంటే  చూస్తూ ఊరుకోమన్నారు. క్రమశిక్షణ తప్పిన ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోరని ఆయన ప్రశ్నించారు.

తాను రెచ్చగొట్టాలని భావిస్తే రాష్ట్రంలో అగ్నిగుండం సృష్టిస్తామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.  ఓ దళిత కార్మికుడిని కులం పేరుతో దూషించి దాడి చేసిన ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్ పై ఎందుకు చర్యలు తీసుకోరో చెప్పాలని పవన్ కళ్యాణ్ డీజీపీని ప్రశ్నించారు.

ఆకు రౌడీలు, గాలి రౌడీలకు భయపడే వ్యక్తిని కానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఒక్క సైగ చేస్తే కాళ్లు విరగ్గొట్టి చింతమనేనిని కూర్చోబెడతారని పవన్ హెచ్చరించారు. 16 ఏళ్ల వయస్సులోనే ఆకురౌడీలను గాలి రౌడీలను తన్ని తరిమివేసినట్టు ఆయన గుర్తుచేశారు.

చింతమనేని లాంటి వ్యక్తి సింగపూర్ లో ఉంటే కర్రతో కొడతారు....సౌదీలో తల తీస్తారు.. చింతమనేని అంటే చంద్రబాబు,లోకేష్‌లకు భయం ఉండొచ్చన్నారు. మహిళలను బూతులు తిడితే చూస్తూ ఊరుకోనని ఆయన హెచ్చరించారు.

 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్