రాత్రివేళ ప్రియుడితో భార్య...అది చూసిన భర్త ఏం చేశాడంటే

Published : Sep 26, 2018, 06:11 PM IST
రాత్రివేళ ప్రియుడితో భార్య...అది చూసిన భర్త ఏం చేశాడంటే

సారాంశం

వివాహేతర సంబంధం పచ్చని కాపురంలో చిచ్చు రేపింది. భర్తను నిందితుడిగా మారిస్తే భార్య, ఆమె ప్రియుడిని ఆస్పత్రి పాల్జేసింది. ఈ ఘటన కడప జిల్లా వీరబల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే వీరబల్లి మండలం సుగాలితండాకు చెందిన రేణుకకు 25 ఏళ్ల క్రితం సంబేపల్లె మండలం శెట్టిపల్లెకకు చెందిన సుధాకర్ నాయక్ తో వివాహం జరిగింది. వీరికి నలుగురు సంతానం.  

కడప: వివాహేతర సంబంధం పచ్చని కాపురంలో చిచ్చు రేపింది. భర్తను నిందితుడిగా మారిస్తే భార్య, ఆమె ప్రియుడిని ఆస్పత్రి పాల్జేసింది. ఈ ఘటన కడప జిల్లా వీరబల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే వీరబల్లి మండలం సుగాలితండాకు చెందిన రేణుకకు 25 ఏళ్ల క్రితం సంబేపల్లె మండలం శెట్టిపల్లెకకు చెందిన సుధాకర్ నాయక్ తో వివాహం జరిగింది. వీరికి నలుగురు సంతానం.

25ఏళ్లుగా సజావుగా సాగుతున్న వీరి సంసారంలో కలతలు చెలరేగాయి. వివాహేతర సంబంధం వీరి మధ్య చిచ్చురేపింది. ఎంతో అన్యోన్యంగా ఉన్న దంపతులు నిత్యం గొడవలతో వాగ్వాదానికి దిగేవారు. ఈ గొడవలు ఎక్కువ అవుతుండటంతో రేణుక నెలరోజుల క్రితం పుట్టింటికి వచ్చేసింది. అయితే కలికిరికి చెందిన అహమ్మద్ తో రేణుకకు వివాహేతర సంబంధం ఉంది. 

ఈ నేపథ్యంలో పుట్టింటికి వచ్చేసిన కూడా రేణుక తన ప్రవర్తన మార్చుకోలేదు. సోమవారం రాత్రివేళ తన ప్రియుడు అహ్మద్ తో కలిసి రేణుక తన పుట్టింట్లో ఉంది. ఈ విషయం తెలుసుకున్న భర్త సుధాకర్ నాయక్ కొడవలితో దాడి చేశాడు. ప్రియుడు అహమ్మద్ పై విచక్షణా రహితంగా దాడి చేశాడు. అడ్డువచ్చిన భార్యను సైతం వదల్లేదు. రేణుకపై కూడా దాడి చేసి పరారయ్యాడు.  

సుధాకర్ నాయక్ కత్తితో దాడి చేస్తుండటం చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపు నిందితుడు సుధాకర్ నాయక్ పరారయ్యాడు. అయితే తీవ్ర గాయాలపాలైన ప్రియుడు అహమ్మద్, రేణుకను చికిత్స నిమిత్తం రాయచోటి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అహమ్మద్ పరిస్థితి విషమించడంతో తిరుపతికి రిఫర్ చేశారు వైద్యులు. 

అయితే అహమ్మద్ తిరుపతి ఆస్పత్రిలో శస్త్రచికిత్స నిర్వహించారు. ఐదురోజులు గడిస్తే కానీ పరిస్థితి చెప్పలేమని వైద్యులు స్పష్టం చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. రేణుక కడప ఆస్పత్రిలో చికిత్సపొందుతుంది. 

అయితే నిందితుడు సుధాకర్ నాయక్ ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తనభార్య వివాహేతర సంబంధం నెరపడంతో తట్టుకోలేక హత్యకు పాల్పడ్డాడని ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu