టూ వీలర్స్ కూ జిపిఎస్: పిల్లల క్షేమం కోసమే

First Published Mar 13, 2018, 11:22 AM IST
Highlights
  • వినటానికే ఆశ్చర్యంగా ఉన్నా ఎంతో మంచిదంటున్నారు నిపుణులు, రవాణా శాఖ ఉన్నతాధికారులు.

టూ వీలర్స్ కూ జిపిఎస్ అమర్చుకోవటం. వినటానికే ఆశ్చర్యంగా ఉన్నా ఎంతో మంచిదంటున్నారు నిపుణులు, రవాణా శాఖ ఉన్నతాధికారులు. ఎందుకంటే, ఈమధ్య జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో టూ వీలర్స్ యాక్సిడెంట్లే చాలా ఎక్కువుగా ఉంటున్నాయి. ఇంటి నుండి బయలుదేరిని పిల్లలు ఎక్కడకు వెళుతున్నారో, ఏం చేస్తున్నారో కూడా తల్లి, దండ్రులకు అర్ధం కావటం లేదు.

ఏదైనా జరిగితే సమాచారం అందుకోవటం తప్ప చేయగలిగేది కూడా ఏమీ ఉండటం లేదు. అందుకనే, అటువంటి సమస్యకు విరుగుడుగు టూవీలర్స్ కూ జిపిఎస్ ఏర్పాటు చేస్తే ఎలాగుంటుంది? అనే ఆలోచన నిపుణులకు, ఉన్నతాధికారులకు వచ్చింది. వెంటనే రంగంలోకి దిగేసారు.

 

ఇదే విషయమై తిరుపతి ఆర్టీవో వివేకానందరెడ్డి మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణకు టూవీలర్స్‌కి గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌(జీపీఎస్‌)ను అమర్చకోవాలని సూచించారు. అధునాతన బైక్‌లపై యువత రాత్రి వేళల్లో  రేస్‌లో పాల్గొంటున్నారని, దీంతో ప్రమాదాలు చోటు చేసుకుని అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నట్లు చెప్పారు.

జిపిఎస్ ఏర్పాటు చేసుకుంటే ప్రమాదాలను నియంత్రించ వచ్చన్నారు. దానికి తోడు వారి వారి పిల్లలు బైక్‌లపై ఎక్కడికి వెళుతున్నారో, ఎంత స్పీడు వెళుతున్నారన్న విషయాలను కూడా సెల్‌ఫోన్‌ ద్వారా తల్లిదండ్రులు తెలుసుకునేందుకు వీలుంటుందన్నారు.

తల్లిదండ్రులు వారి పిల్లల భద్రత, భవిష్యత్‌ కోసం వారి బైక్‌లకు జీపీఎస్‌ను అమర్చాలని సూచించారు. మొట్ట మొదటిసారిగా జీపీఎస్‌ అమర్చిన టూవీలర్‌ను తిరుపతిలోని టీవీఎస్‌ బైక్‌ షోరూంలో జిల్లా కలెక్టర్‌ పిఎస్‌. ప్రద్యుమ్న, తిరుపతి సబ్‌కలెక్టర్‌ నిషాంత్‌కుమార్, తిరుపతి ఎస్పీ అభిషేక్‌ మొహంతి ప్రారంభిస్తారని చెప్పారు.

click me!