పవన్ పొలిటికల్ ఎంట్రీపై గౌతమి షాకింగ్ కామెంట్స్

Published : Sep 18, 2018, 11:10 AM ISTUpdated : Sep 19, 2018, 09:28 AM IST
పవన్ పొలిటికల్ ఎంట్రీపై గౌతమి షాకింగ్ కామెంట్స్

సారాంశం

ప్రతి  ఒక్కరూ రాజకీయాల్లో భాగం కావాలన్న గౌతమి.. పవన్ రాజకీయ ప్రవేశం అతని సొంత విషయమన్నారు.

తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి సినీ నటి గౌతమి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వూలో రాజకీయాల గురించి చర్చించిన ఆమె.. పవన్ రాజకీయ ప్రవేశం గురించి కూడా చర్చించారు.

ప్రతి  ఒక్కరూ రాజకీయాల్లో భాగం కావాలన్న గౌతమి.. పవన్ రాజకీయ ప్రవేశం అతని సొంత విషయమన్నారు. ‘‘ప్రతి ఒక్కరూ రాజకీయాల్లోకి రావడమనేది వాళ్ల సొంత విషయం. ప్రతి ఒక్కరి కమిట్‌మెంట్‌ను బట్టి వాళ్లు తీసుకునే నిర్ణయం. ఎవరైనా సరే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత... పబ్లిక్ లైఫ్‌లోకి వచ్చాక ఎలా పని చేస్తారు? ప్రజలకు ఎలా సేవ చేస్తారు? సేవ చేయడం కన్నా ప్రజలకు ఏవిధంగా న్యాయం చేస్తారు? అన్నది ప్రధానం. ఈ జర్నీ అనేది ఒకరోజులోనో లేదంటే ఆరు నెలల్లోనో తెలిసేది కాదు. రాను రాను చూడాలి. ఎక్కడ ప్రజలకు మంచి జరుగుతుందో అక్కడ నా సపోర్ట్ ఉంటుంది’’ అని తెలిపారు గౌతమి.

PREV
click me!

Recommended Stories

AP Municipal Elections 2026 : టీడీపీ మేయర్, మున్సిపల్ ఛైర్ పర్సన్ అభ్యర్థులు వీళ్లే...
Kotamreddy Sridhar Reddy Serious Warning to YS Jagan | Punganur Incident | TDP Vs YCP