నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడి, రైలు నుండి తోసివేత

Published : Nov 24, 2019, 02:24 PM IST
నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడి, రైలు నుండి తోసివేత

సారాంశం

అనంతపురం జిల్లాలోని తిమ్మనచర్ల రైల్వే స్టేషన్ వద్ద  గోవిందప్ప అనే వ్యక్తి నుండి రూ. 50 వేలు దోచుకొని రైలు నుండి తోసేశారు. గోవిందప్ప ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 


అనంతపురం:  నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆదివారం నాడు దారుణం చోటు చేసుకొంది. స్టేషర్‌లో ఆగి ఉన్న రైలు నుండి ఓ ప్రయాణీకుడి నుండి రూ. 50 వేలు దోచుకొని రైలు నుండి తోసేశారు. ఈ ఘటనలో బాధితుడు గోవిందప్ప గాయపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అనంతపురం జిల్లాలోని తిమ్మనచర్ల రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం నాడు ఉదయం ఈ ఘటన చోటు చేసుకొంది. ఆగి ఉన్ రైలులో ఉన్న గోవిందప్ప అనే ప్రయాణీకుడి నుండి రూ. 50వేలు తీసుకొని గోవిందప్పను రైలు నుండి కిందకు తోసేశారు. 

ఈ ఘటనలో గోవిందప్ప గాయపడ్డాడు.  గోవిందప్ప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు గోవిందప్పను  ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో గోవిందప్పకు చికిత్స అందించారు.

కర్ణాటక రాష్ట్రంలోని హోస్పేటకు చెందిన గోవిందప్ప మంత్రాలయం వెళ్లేందుకు బెంగుళూరు నుండి నాందేడ్ వెళ్లే  నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు.  రైలు తిమ్మనచర్ల రైల్వేస్టేషన్ వద్దకు చేరుకొనేసరికి గోవిందప్ప దగ్గరకు ముగ్గురు వ్యక్తులు వచ్చి ఆయన వద్ద నుండి నగదును తీసుకొని ఆయనను రైలు నుండి  కిందకు తోసేశారు.

గోవిందప్పను  రైల్వే పోలీసులు గుంతకల్లు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గోవిందప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : దేశవ్యాప్తంగా వర్షాలు, ఈ తెలుగు జిల్లాల్లోనూ.. ఎల్లో అలర్ట్ జారీ
Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu