అచ్చు దృశ్యం సినిమానే: పదేళ్లు సహజీవనం, హత్య

By narsimha lode  |  First Published Nov 24, 2019, 1:37 PM IST

పదేళ్ల పాటు సహజీవనం చేసిన విజయ్ ను రాధ అనే వివాహిత హత్య చేసింది.ఈ ఘటన కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటలో శనివారం నాడు చోటు చేసుకొంది.



విజయవాడ:పదేళ్ల పాటు సహజీవనం చేసిన వ్యక్తిని దారుణంగా హత్య చేసింది ఓ మహిళ.  ఈ ఘటన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట గ్రామంలో చోటు చేసుకొంది. అయితే ఈ హత్య కేసులో  ప్రధాన పాత్ర పోషించిన తన  కూతురు, అల్లుడిని కేసు నుండి తప్పించుకొనేందుకు గాను దృశ్యం సినిమా‌ను ఫాలో అయింది. ఈ హత్యను ఎలా చేసిందో పోలీసులకు నిందితురాలు వివరించింది.

కర్ణాటకకు చెందిన విజయకుమార్ బతుకుదెరువు కోసం పదేళ్ల క్రితం కృష్ణా జిల్లాకు వచ్చాడు.  జిల్లాలోని జగ్గయ్యపేట ధనంబోర్డులో మకాం పెట్టాడు. అదే ప్రాంతానికి చెందిన వివాహిత రాధతో విజయ్‌కుమార్‌కు పరిచయం ఏర్పడింది. రాధ తన భర్తకు దూరమై ఇద్దరు బిడ్డలతో నివాసం ఉంటుంది. దీంతో రాధతో విజయ్ కుమార్ సహజీవనం చేస్తున్నాడు.

Latest Videos

విజయ్‌కుమార్‌ సహకారంతో రాధ తన పిల్లల్ని పెంచింది. రాధ పెద్ద కొడుకు ఇంటర్ పూర్తి చేశాడు. అతను ఓ మెకానిక్ షాపులో పనిచేస్తున్నాడు. కూతురికి వివాహం కూడ చేసింది. అంతేకాదు రాధ ఓ ఇల్లును కూడ కొనుగోలు చేసింది.  

కొద్ది రోజుల క్రితం రాధ అల్లుడు విజయ్‌కుమార్‌ వద్ద రూ. 50వేలు అప్పుగా తీసుకొన్నాడు. అయితే ఈ డబ్బును తిరిగి చెల్లించాలని  విజయ్ కుమార్  రాధను అడిగాడు. ఈ విషయమై ఇంట్లో గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో శనివారం నాడు మరోసారి గొడవ జరిగింది. 

దీంతో ఆగ్రహంతో రాధ విజయ్‌కుమార్‌ను గడ్డపారతో పొడిచింది.  అంతేకాదు ఇంట్లో రక్తపు మరకలను తుడిచేసింది. ఈ కేసు నుండి తన కొడుకు,. కూతురు, అల్లుడిని తప్పించేందుకు ఆమె ప్రయత్నించింది. 

ఈ హత్య విషయమై పోలీసులు నిందితురాలిని  ప్రశ్నిస్తే అసలు విషయాన్ని చెప్పింది. తన అల్లుడు, కూతురిపై విజయ్‌పై దాడి చేస్తోంటే అడ్డుకొనే క్రమంలో తాను విజయ్‌కుమార్‌పై గడ్డపారతో దాడి చేసినట్టుగా నిందితురాలు చెప్పారు. నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.

click me!