
కన్ఫర్మేషన్: ఏపికి కేంద్రం ప్రకటించింది ‘ప్రత్యేకసాయం’ మాత్రమే. ఇంతకాలమూ చంద్రబాబు అండ్ కో మాత్రం కేంద్రం ఏపికి ప్రత్యేక ప్యాకేజి ప్రకటించినట్లు నమ్మబలుకుతున్నారు. అందుకే కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజికి చట్టబద్దత కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా గవర్నర్ స్పీచ్ తో కేంద్రం ప్రకటించింది కేవలం సాయం మాత్రమేనని కన్ఫర్మ్ అయిపోయింది. కేంద్రం ‘సాయం’ ప్రకటిస్తే మరి చంద్రబాబు ‘ప్యాకేజి’ అంటూ ఎందుకు డిమాండ్ చేస్తున్నట్లు? సింపుల్ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నాలు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తన ప్రసంగంలో కేంద్రం రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేకసాయాన్ని ప్రకటించిందని స్పష్టంగా చదివారు.
అంటే, చంద్రబాబునాయుడు ఆలోచనేమిటో అందరికీ అర్ధమవుతోంది. కేంద్రం ప్రకటించింది సాయం మాత్రమేనని అందరికీ తెలుసు. అందుకే ప్రత్యేక ప్యాకేజికి చట్టబద్దత కావాలని చంద్రబాబు అండ్ కో ఎంత డిమాండ్ చేస్తున్న కేంద్రం పట్టించుకోవటం లేదు. ప్రకటించిన ప్రత్యేక సాయానికే దిక్కులేనపుడు తాను ప్రకటించని ప్ర్యతేక ప్యాకేజికి చట్ట బద్దత ఎందుకు కల్పిస్తుంది కేంద్రం? ప్యాకేజికి చట్టబద్దత అంటూ చంద్రబాబు పదే పదే చేస్తున్న డిమాండ్ తో ప్రజల్లో ఎవరికైనా అనుమానాలుంటే గవర్నర్ ప్రసంగంతో క్లియర్ అయిపోయినట్లే.
ప్రతిపక్షం ప్రత్యేకహోదా గురించి ఆందోళనలు చేసినప్పుడల్లా చంద్రబాబు వ్యూహాత్మకంగా ప్రత్యేకప్యాకేజికి చట్టబద్దత అంటూ హడావుడి మొదలుపెడతారు. కేంద్రమంత్రి సుజనాచౌదరి తదితరులతో చట్టబద్దత అంశంపైనే మీడియాలో హైలైట్ చేయిస్తారు. దాంతో ప్రత్యేక డిమాండ్ మరుగునపడిపోతుంది. ఇదే వ్యూహాలతో చంద్రబాబు ప్రభుత్వం రెండున్నరేళ్ళు గడిపేసింది. ఇంకో ఏడాది అయిపోతే అంతటా ఎన్నికల వేడే రాజుకుంటుంది. అప్పుడు చూడాలి చంద్రబాబు ఏం చేస్తారో.