ప్రేక్షకుడికి వినోదం అందుబాటులోకి: ఏపీ మంత్రి పేర్నినాని

Published : Sep 20, 2021, 03:35 PM ISTUpdated : Sep 20, 2021, 04:14 PM IST
ప్రేక్షకుడికి వినోదం అందుబాటులోకి: ఏపీ మంత్రి పేర్నినాని

సారాంశం

ఆన్‌లైన్ లో సినిమా టికెట్ విధానాన్ని తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకొన్నామని ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. సినీ ప్రముఖులు ఇవాళ మంత్రి నానితో సమావేశమయ్యారు.ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను నాని మీడియాకు వివరించారు.

అమరావతి:త్వరలోనే ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విధానాన్ని తీసుకొస్తామని ఏపీ రాష్ట్ర మంత్రి పేర్నినాని స్పష్టం చేశారు.సినీ పరిశ్రమకు చెందిన పెద్దలతో ఏపీ మంత్రి పేర్నినాని సోమవారం నాడు భేటీ అయ్యారు. సినీ పరిశ్రమకు చెందిన సమస్యలపై చర్చించారు.ఈ సమావేశం ముగిసిన తర్వాత పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.

 ఆన్‌లైన్ టికెటింగ్ పై పారదర్శకతతో కూడిన విధానాన్ని తీసుకొస్తామని మంత్రి చెప్పారు. ప్రభుత్వం నిర్ధేశించిన టికెట్ రేట్లు మాత్రమే ఉంటాయని ఆయన తేల్చి చెప్పారు.  టికెట్ల ధరల విషయంలో పారదర్శకత ఉండేలా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆన్‌లైన్ టికెట్ల విషయంలో అన్ని వర్గాల నుండి సానుకూల స్పందన ఉందని మంత్రి నాని చెప్పారు. సినీ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించినట్టుగా మంత్రి తెలిపారు.ప్రేక్షకుడికి అందుబాటులో వినోదం ఉండే విధంగా చర్యలు తీసుకొంటామని మంత్రి వివరించారు.


 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు