
అమరావతి: రాష్ట్రంలో అక్రమ కట్టడాల కూల్చివేతకు సర్కార్ రంగం సిద్దం చేసింది. ప్రజా వేదిక కూల్చివేతతోనే రాష్ట్రంలోని అక్రమ కట్టడాల కూల్చివేతను ప్రారంభించనున్నారు. బుధవారం నాడు ప్రజా వేదికను కూల్చివేసేందుకు చర్యలు తీసుకొంటున్నట్టుగా రెవిన్యూ శాఖ సీఆర్‌డీఏకు సమాచారం ఇచ్చింది
కలెక్టర్ల సమావేశంలో ప్రజా వేదిక భవనాన్ని కూల్చివేయాలని సోమవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం నాడు ఎస్పీలు, కలెక్టర్ల సమావేశంలో కూడ ప్రజా వేదిక గురించి సీఎం జగన్ మరోసారి ప్రస్తావించారు.
ప్రజా వేదిక పక్కనే ఉణ్న చంద్రబాబు నివాసం గురించి కూడ సీఎం జగన్ వ్యాఖ్యలు చేశారు. అక్రమంగా నిర్మించిన భవనంలోనే చంద్రబాబు నివాసం ఉన్నారని జగన్ ఆరోపించారు. అంతేకాదు తన నివాసం పక్కనే నిబంధనలకు విరుద్దంగా ప్రజా వేదికను నిర్మించారని జగన్ మండిపడ్డారు.
గత ప్రభుత్వ హాయంలో నిబంధనలకు విరుద్దంగా అనేక నిర్మాణాలు చోటు చేసుకొన్నాయని జగన్ ఆరోపించారు. నిబంధనలకు విరుద్దంగా తనతో సహా ఎవరూ పనిచేసినా ఉపేక్షించవద్దని జగన్ ఆదేశించారు.
ప్రజా వేదికను కూల్చివేయాలని జగన్ ఆదేశాలు జారీ చేయడంతో రెవిన్యూ యంత్రాంగం అక్రమ కట్టడాల కూల్చివేతకు ఏర్పాట్లు ప్రారంభించింది. ప్రజా వేదికను కూల్చివేయనున్నట్టుగా సీఆర్‌డీఏకు రెవిన్యూ అధికారులు మంగళవారం నాడు సమాచారం ఇచ్చారు.
ఈ నెల 19వ తేదీన యూరప్ పర్యటనకు వెళ్లిన చంద్రబాబునాయుడు ఇవాళ హైద్రాబాద్‌కు తిరిగి వచ్చారు. బుధవారం నాడు అమరావతికి వెళ్లనున్నారు. ఇప్పటికే ప్రజా వేదికను తనకు ఇవ్వాలని ఆయన సీఎం జగన్ కు లేఖ రాశారు.
తనను కలిసేందుకు వచ్చే సందర్శకుల కోసం ఈ భవనాన్ని ఉపయోగించుకొంటానని ఆ లేఖలో చంద్రబాబు కోరారు. కానీ, ఈ విషయమై సీఎం నుండి ఎలాంటి స్పందన రాలేదు. పైగా ఈ భవనాన్ని కూల్చివేయాలని నిర్ణయం తీసుకోవడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
యూరప్ పర్యటన నుండి వచ్చిన చంద్రబాబు బుధవారం నాడు అమరావతికి వెళ్తారు. చంద్రబాబు నివాసం ఉంటున్న భవనం కూడ అక్రమంగా నిర్మించిందేనని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు కూడ ఈ నివాసాన్ని ఖాళీ చేయాలని కోరుతున్నారు.
చంద్రబాబునాయుడు తన నివాసాన్ని ఖాళీ చేయకపోతే కూల్చివేస్తామని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇదివరకే హెచ్చరించారు. రేపు అమరావతికి వస్తున్న చంద్రబాబుకు రెవిన్యూ, సీఆర్‌డీఏ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.
చంద్రబాబు నివాసం ఉంటున్న ఇల్లుతో పాటు పలు ఆశ్రమాలు.. రాజకీయ ప్రముఖుల అతిథి గృహాలు ఈ ప్రాంతంలో నిర్మించారు. అన్ని రకాల నిబంధనలను ఉల్లంఘించి ఇక్కడ వెలిసిన నిర్మాణాలను తొలగిస్తామని సీఎం ప్రకటించారు. అమరావతిలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడైనా అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని సీఎం ఆదేశించారు.
ప్రజా వేదిక కూల్చి వేయకూడదని టీడీపీ కోరుతోంది. రేపు కూల్చివేతకు సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది.చంద్రబాబు కూడ రేపు అమరావతికి రానున్నారు. ఈ తరుణంలో ఏం జరుగుతోందోననే ఉత్కంఠ నెలకొంది.
2014లో చంద్రబాబునాయుడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమరావతిలో నివాసం ఉండేందుకు ఇల్లును వెదికారు ఆ సమయంలో టీడీపీ నేత లింగమనేని రమేష్‌కు చెందిన ఇంటిలో చంద్రబాబు నివాసం ఉంటున్నారు. అయితే ఈ నివాసం కూడ నిబంధనలకు విరుద్దంగానే నిర్మించేదేనని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
సంబంధిత వార్తలు
చంద్రబాబు నివాసంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
ప్రత్యేక హోదా ఉద్యమం: కేసుల ఎత్తివేతకు జగన్ ఆదేశం
కాల్‌మనీ సెక్స్ రాకెట్‌పై సీఎం జగన్ సీరియస్: ఎవరినీ వదలొద్దు
త్వరలోనే పోలీసు శాఖలోఖాళీలు భర్తీ: సుచరిత