బ్రేకింగ్: వైసిపి ఆమరణ దీక్షలకు అనుమతి

First Published Apr 5, 2018, 8:02 PM IST
Highlights
సాయంత్రం వరకూ వైసిపి ఎంపిల ఆందోళనలకు అనుమతి వస్తుందా? రాదా? అన్న అనుమానం అందరిలోనూ కనబడింది.

మొత్తానికి చంద్రబాబునాయుడు ఏపి భవన్లో వైసిపి ఎంపిల ఆమరణ నిరాహార దీక్షకు అనుమతిచ్చారు. సాయంత్రం వరకూ వైసిపి ఎంపిల ఆందోళనలకు అనుమతి వస్తుందా? రాదా? అన్న అనుమానం అందరిలోనూ కనబడింది. ఒత్తిడికి లొంగో లేకపోతే ప్రజాగ్రహానికి భయపడో అనుమతైతే ఇచ్చింది.

పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం దిగిరాకపోతే ఎంపీల పదవులకు రాజీనామాలు చేసి వెంటనే ఏపీ భవన్‌లో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతారని వైఎస్సార్‌ సీపీ ప్రకటించిన విషయం తెలిసిందే.

లోక్‌సభ వాయిదా పడిన వెంటనే వైఎస్సార్‌ సీపీ ఎంపీలు రాజీనామాలు చేసి, వెంటనే దీక్షకు దిగనున్నారు. కాగా రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదా సాధన కోసం తాము చేస్తున్న పోరాటానికి అండగా నిలిచి ఏపీ భవన్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు అనుమతించాలంటూ ఎంపీలు ఇప్పటికే  ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.

click me!