ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన మొదటి హిజ్రా

First Published Jan 4, 2018, 3:23 PM IST
Highlights
  • ప్రభుత్వం మాట నిలుపుకున్నది.  

ప్రభుత్వం మాట నిలుపుకున్నది.  ట్రాన్స్ జెండర్ కు కూడా ప్రభుత్వ ఉద్యోగాలివ్వాలని ఈమధ్యనే మంత్రివర్గం నిర్ణయిచిన సంగతి అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే కడప జిల్లాలో ఓ హిజ్రాలకు ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇచ్చారు. సమాజంలో హిజ్రాలు గౌరవంగా జీవించాలనే సదుద్దేశంతో చంద్రబాబు వారికి ఉద్యోగ నియామకాలు, పెన్షన్లు, ఇళ్ల పట్టాలు, రేషన్‌కార్డులు అందచేయాలని నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా కడపలో మొట్టమొదటిసారిగా పెనుగొండ శివ ఉరఫ్‌ జానకికి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా ఉద్యోగం ఇచ్చారు. ఈ మేరకు నియామక పత్రాన్ని జి.రఘునాథరెడ్డి కన్సల్టెన్సీ సర్వీసెస్‌ అధినేత జి.రఘునాథరెడ్డి నియామకపత్రాన్ని బుధవారం జానకికి అందచేశారు. పులివెందులలో జరిగిన జన్మభూమి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా కడపలో హిజ్రాకు ఒక ఉద్యోగం ఇచ్చిన విషయాన్ని ప్రకటించారు.

click me!