‘గజల్’ విషయంలో సిగ్గు పడుతున్నా (వీడియో)

First Published Jan 4, 2018, 2:21 PM IST
Highlights
  • తొందరపడి గజల్ శ్రీనివాస్ కు మద్దతు ప్రకటించిన ఏపి దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఇపుడు తీరిగ్గా సిగ్గు పడుతున్నట్లు ప్రకటించారు.

ప్రభుత్వం లెంపలేసుకున్నది. తొందరపడి గజల్ శ్రీనివాస్ కు మద్దతు ప్రకటించిన ఏపి దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఇపుడు తీరిగ్గా సిగ్గు పడుతున్నట్లు ప్రకటించారు. ఇంతకీ విషయం ఏమిటంటే, గజల్ శ్రీనివస్ పై మూడు రోజులుగా లైంగిక ఆరోపణలు వెలుగు చూస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మొదట్లో శ్రీనివాస్ పై ఆరోపణలు వచ్చినపుడు ఎవరూ నమ్మలేదు. అందరిలాగే మంత్రి మాణిక్యాలరావు కూడా ఆరోపణలను కొట్టిపడేసారు. తనకు గజల్ వ్యక్తిగతంగా మంచి మిత్రుడన్నారు. గజల్ అటువంటి వ్యక్తి కాదంటూ వెనకేసుకొచ్చారు.

సీన్ కట్ చేస్తే, రెండు రోజులుగా గజల్ లైగింక చర్యలకు సంబంధించిన వీడియోల క్లిప్పింగులు వెలుగు చూస్తుండటంతో అందరూ నివ్వెరపోతున్నారు. అందులో భాగంగా మాణిక్యాలరావు కూడా స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ, తొందరపడి గజల్ కు మద్దతిచ్చినందుకు సిగ్గుపడుతున్నట్లు చెప్పారు. గజల్ కు రెండు ముఖాలున్న విషయం తెలుసుకోలేకపోయానని లెంపలేసుకున్నారు. వీడియో క్లిప్పింగులను చూసి బాధపడ్డారట.

అమ్మ గురించి, నాన్న గురించి దేశం గురించే కాక జాతి గురించి కూడా నిత్యం ఎంతో గొప్పగా మాట్లాడుతూ, పాటలు పడుతున్న గజల్ అసలు స్వరూపం చూసినపుడు తాను ఆశ్చర్యపోయినట్లు వాపోయారు. ఇటువంటి వ్యక్తుల విషయంలో పోలీసులు, ప్రభుత్వాలు చాలా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. బాధితులందరికీ న్యాయం జరగాలని మంత్రి చెప్పారు.

 

click me!