చంద్రబాబుకి ఎన్ఎస్జీ భద్రత కట్... మరో 13మంది వీఐపీలకు కూడా..

By telugu teamFirst Published Jan 13, 2020, 12:49 PM IST
Highlights

1984లో ఏర్పాటైన ఎన్ఎస్జీ గత రెండు దశాబ్దాలుగా వీఐపీల భద్రతా విధులు నిర్వహిస్తోంది. ప్రారంభంలో ఆ విధులు దాని పరిధిలోకి లేవు. ప్రస్తుతం జడ్ ప్లస్ కేటగిరిలోని 13మంది హైరిస్క్ వీఐపీలకు ఎన్ఎస్జీ భద్రత కల్పిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎన్ఎస్జీ భద్రతను ఉపసంహరించనున్నారు. కేవలం చంద్రబాబు మాత్రమే కాకుండా మరో 13మంది వీఐపీలకు కూడా ఈ భద్రతను ఉపసంహరించనున్నట్లు సమాచారం. జాతీయ భద్రతా దళం(ఎన్ఎస్జీ) కమాండోలకు వీఐపీల భద్రతా విధుల నుంచి పూర్తిగా విముక్తి కలిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధికార వర్గాలు ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించాయి.

1984లో ఏర్పాటైన ఎన్ఎస్జీ గత రెండు దశాబ్దాలుగా వీఐపీల భద్రతా విధులు నిర్వహిస్తోంది. ప్రారంభంలో ఆ విధులు దాని పరిధిలోకి లేవు. ప్రస్తుతం జడ్ ప్లస్ కేటగిరిలోని 13మంది హైరిస్క్ వీఐపీలకు ఎన్ఎస్జీ భద్రత కల్పిస్తోంది. ఒక్కొక్కరికి రెండు డజన్ల  మంది బ్లాక్ క్యాట్ కమాండోలు చొప్పున అత్యాధునిక ఆయుధాలతో భద్రత కల్పిస్తున్నారు.

Also Read పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బిజీ బిజీ: ఆర్ఎస్ఎస్ నేతలతో భేటీ, ఏం జరుగుతోంది?

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, మాయావతి, ములాయం సింగ్ యాదవ్, ప్రకాశ్ సింగ్ బాదల్, ఫరూక్ అబ్దుల్లా, ముఖ్యమంత్రులు యోగి ఆదిత్య నాథ్( ఉత్తరప్రదేశ్), శర్బానంద సోనేవాల్( అస్సాం), మాజీ ఉప ప్రధాని ఎల్ కే అడ్వాణనీ తదితరులకు ఎన్ఎస్జీ భద్రత ఉంది.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు జరుగుతున్నప్పటికీ వాటిని అరికట్టే చర్యల్లో భాగంగా ఎన్ఎస్జీకి వీఐపీ భద్రతా విధులు తొలగించాలని 2012నుంచే చర్చ జరుగుతోంది. ఉగ్రవాద నిర్మూలన, హైజాక్ వ్యతిరేక కార్యకలాపాల కోసం ఏర్పాటు చేసిన ఎన్ఎస్జీని కేవలం విధులకే పరిమితం చేయాలని కేంద్ర హోంశాఖ భావిస్తోందని సమాచారం.

ఈ తాజా నిర్ణయంతో సుమారు 450 మంది కమాండోలకు ఆ విధుల నుంచి విముక్తి లభిస్తుందని.. వారిని ఎన్ఎస్జీ అసలు విధుల్లోకి కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 130మంది ప్రముఖులకు సంయుక్తంగా భద్రత కల్పిస్తున్న  సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ లకే ఇకపై ఈ వీఐపీల భద్రతాబాధ్యతలు కూడా అప్పగించాలని భావిస్తున్నారు.  

click me!