అమరావతిలో మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీ: ఎమ్మెల్యే అరెస్ట్

Published : Jan 13, 2020, 10:24 AM ISTUpdated : Jan 13, 2020, 11:41 AM IST
అమరావతిలో మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీ: ఎమ్మెల్యే అరెస్ట్

సారాంశం

ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకొన్నారు. 

అమరావతి: ఏపీ రాష్ట్రంలో  పరిపాలన వికేంద్రీకరణను (మూడు రాజధానులు) ఏర్పాటును సమర్ధిస్తూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాదయాత్ర చేపట్టారు.ఈ పాదయాత్రను పోలీసులు అడ్డుకొన్నారు. ఎమ్మెల్యే సహ పలువురు ఆ పార్టీకి చెందిన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉందనే సంకేతాలు వెలువడ్డాయి. అయితే అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ  అమరావతి పరిసర గ్రామాలకు చెందిన రైతులు, స్థానికులు 27 రోజులుగా  ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

Also read:రంగంలోకి బీజేపీ, ఢిల్లీకి పవన్: వారంలో తేలనున్న అమరావతి భవితవ్యం?

ఇదిలా ఉంటే మూడు రాజధానుల విధానాన్ని సమర్ధిస్తూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సోమవారం నాడు పెనుమాక నుండి సీఎం క్యాంప్ కార్యాలయం వరకు పాదయాత్రను చేపట్టారు.ఈ ర్యాలీకి అనుమతులు లేవని పోలీసులు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి చెప్పారు. అయినా పాదయాత్రను ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. దీంతో ఆళ్ల రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

also read:కారణమిదే:కేబినెట్‌లో భారీ మార్పులకు కేసీఆర్ ప్లాన్?

రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఏపీకి మూడు రాజధానులను సమర్ధిస్తూ వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు ర్యాలీలు నిర్వహించారు. ఈ ర్యాలీల్లో భాగంగానే మంగళగిరి నియోజకవర్గంలో కూడ సోమవారం నాడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ర్యాలీ నిర్వహించారు.  ఈ ర్యాలీ కొనసాగితే ఉద్రిక్తత నెలకొనే అవకాశం ఉందని పోలీసుు ఆళ్ల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు.

ఏపీ రాష్ట్రంలో పరిపాలనను వికేంద్రీకరణ కోసం మూడు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు చేయాలనే యోచనలో ఏపీ సర్కార్ ఉన్నట్టుగా సంకేతాలు ఇచ్చింది.ఈ విషయమై జీఎన్ రావు, బోస్టన్  కన్సల్టెన్సీ కమిటీల నివేదికలపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ హైపవర్ కమిటీ ఈ నెల 18వ తేదీ లోపుగా సీఎం జగన్ కు నివేదిక ఇవ్వనుంది.

ఈ నివేదిక ఆధారంగా ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. హైపవర్ కమిటీ నివేదికపై ఈ నెల 18వ తేదీన కేబినెట్‌లో చర్చించనున్నారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో కూడ ఈ కమిటీపై చర్చిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వం ఈ విషయమై నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

PREV
click me!

Recommended Stories

RK Roja Comments on Chandrababu Super Six: సూపర్ సిక్స్ – సూపర్ ప్లాప్ | Asianet News Telugu
నగరిలోచంద్రబాబు సభ అట్టర్ ఫ్లాప్ | RK Roja Sensational Comments on Chandrababu | Asianet News Telugu