కాకినాడ జిల్లాలోని ఇవాళ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
కాకినాడ: కాకినాడ జిల్లాలోని పిఠాపురం-సామర్లకోట మధ్య సోమవారం నాడు గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విశాఖపట్టణంనుండి విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.విశాఖపట్టణం- విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఒకే ట్రాక్ పై రైళ్లను పంపుతున్నారు.
గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఈ మార్గంలో ఇతర రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. యశ్వంత్ పూర్, రత్నాచల్ ఎక్స్ ప్రెస్ లను పిఠాపురం రైల్వేస్టేషన్ లోనే నిలిపివేశారు. గంటకు పైగా గోపాలపురం రైల్వేస్టేషన్ లోనే విశాఖపట్టణం రైలును నిలిపివేశారు. గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.