పోలవరం ప్రాజెక్ట్: జగన్‌కు తీపికబురు, కేంద్రం నుంచి నిధులు

By sivanagaprasad KodatiFirst Published Nov 8, 2019, 3:22 PM IST
Highlights

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్రం నుంచి కీలక ముందడుగు పడింది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులు చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. రూ.1,850 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ఆర్ధికశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్రం నుంచి కీలక ముందడుగు పడింది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులు చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. రూ.1,850 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ఆర్ధికశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

పోలవరం కోసం ఖర్చు చేసిన నిధులను తిరిగి చెల్లించాలని ఇటీవల ప్రధాని మోడీని కలిసిన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర ఆర్ధిక శాఖ నిధుల మంజూరుకు ఆమోదం తెలిపింది.

త్వరలోనే ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమకానున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ కోసం ఏపీ సర్కార్ ఇప్పటి వరకు రూ.5,600 కోట్లు ఖర్చు చేసింది. తొలుత రూ.3 వేల కోట్లు విడులవుతాయని భావించినప్పటికీ.. పరిశీలన తర్వాత మరికొన్ని నిధులు విడుదలయ్యే అవకాశమున్నట్లు ఆర్ధికశాఖ వర్గాలు వెల్లడించాయి. 

Also Read:కేంద్ర మంత్రితో సీఎం జగన్ భేటీ.... కడప స్టీల్ ప్లాంట్ పై కీలక నిర్ణయం

వైయస్సార్‌ కడపజిల్లాలో నిర్మించ తలపెట్టిన స్టీల్‌ప్లాంట్‌కు ఎన్‌ఎండీసీ నుంచి ఇనుపఖనిజం సరఫరాపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ చేసిన విజ్ఞప్తిపై కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు గనుల శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రదాన్‌ సానుకూలంగా స్పందించారు.

ఎన్‌ఎండీసీ నుంచి ఇనుప ఖనిజాన్ని సరఫరాచేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, ఎన్‌ఎండీసీ మధ్య త్వరలో ఒప్పందం కుదరనుంది. 

శుక్రవారం సచివాలయంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలకు సంబంధించిన సీనియర్‌ అధికారులు, ఉక్కుశాఖ అధికారులతో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సమావేశమయ్యారు. ఆయా శాఖలకు సంబంధించి పెండింగులో ఉన్న అంశాలు, దృష్టిపెట్టాల్సిన అంశాలను రాష్ట్ర ప్రభుత్వ సీనియర్‌ అధికారులు వివరించారు. 

పునర్వివిభజన చట్టం ప్రకారం కడపలో స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉందని, దీనికోసం ప్రపంచంలోని ప్రఖ్యాత ఉక్కుకంపెనీలతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని వివరించారు. ప్లాంటు నిర్వహణలో స్థిరత్వం సాధించడానికి నిరంతరాయంగా ఇనుపఖనిజాన్ని సరఫరాచేయాలని కోరారు.

Also Read:జగన్ శీతకన్ను: సీఎం బస్సులకే దిక్కు లేదు!

దీనిపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ సానుకూలంగా స్పందించారు. ఏపీ ప్రభుత్వం ఎన్‌ఎండీసీ ఒప్పందం చేసుకుంటుందని వెల్లిడించారు. త్వరలోనే దీనిపై ఎంఓయూ కుదర్చుకోవాలని కేంద్ర ఉక్కుశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. 

 

చమురు, గ్యాస్‌ కంపెనీలు ఏపీలో తమ టర్నోవర్‌కు తగినట్టుగా సీఎస్‌ఆర్‌ నిధులు ఇవ్వాలంటూ చేసిన విజ్ఞప్తిపైనా కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో ఆయా కంపెనీల టర్నోవర్‌ మేరకే సీఎస్‌ఆర్‌ వచ్చేలా చూస్తామని కేంద్రమంత్రి స్పష్టంచేశారు. 

click me!