
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాల్లో ప్రథమ స్థానంలో ఉందని, ప్రజా మౌలిక సౌకర్యాల కల్పన విషయంలో కొత్త మెరుగ్గా ఉందని గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్–జీజీఐ 2021 (Good Governance Index 2021) తెలిపింది. సుపరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్ షా శనివారం సుపరిపాలన సూచిక–2021 (Good Governance Index 2021) విడుదల చేశారు. ప్రభుత్వ పాలనలోని 10 రంగాల్లో 58 సూచికల ఆధారంగా పరిపాలన, సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల విభాగం (DARPG) ర్యాంకింగ్స్‌ను నిర్ణయించారు.
GGI 2020-21 లోని రంగాలు ..1) వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు, 2) వాణిజ్యం & పరిశ్రమలు, 3) మానవ వనరుల అభివృద్ధి, 4) ప్రజారోగ్యం, 5.) పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & యుటిలిటీస్, 6) ఆర్థిక పాలన, 7) సాంఘిక సంక్షేమ & అభివృద్ధి, 8) న్యాయ & ప్రజా భద్రత, 9) పర్యావరణం మరియు 10) పౌర-కేంద్రీకృత పాలన. GGI 2020-21 నివేదికలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను నాలుగు వర్గాలుగా వర్గీకరించారు. గ్రూప్-ఏలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గోవా, గుజరాత్, హర్యానా, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర పంజాబ్, తమిళనాడు ఉన్నాయి. గ్రూప్ బీలో ఇతర రాష్ట్రాలు, గ్రూప్ సీలో ఈశాన్య రాష్ట్రాలు, గ్రూప్ డీలో కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి.
Read Also : భారత్‌లోనూ బూస్టర్ డోస్.. ముందుగా ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కి: ప్రధాని మోడీ కీలక ప్రకటన
ఈ నివేదిక ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో వృద్ధిని సాధించింది. రాష్ట్ర వార్షిక వృద్ధి రేటు జీజీఐ 2019లో 6.3 శాతం ఉండగా, 2020–21లో 11.3 శాతానికి పెరిగిందని పేర్కొంది. ఉద్యానవన పంటల రంగంలోనూ ఆంధ్రప్రదేశ్ కూడా గణనీయమైన వృద్ధి సాధించిందని తెలిపింది. ఉద్యానవన పంటల ఉత్పత్తి వార్షిక వృద్ధి రేటు 4.7 శాతం నుంచి 12.3 శాతానికి చేరిందని నివేదిక తెలిపింది. అలాగే పాల ఉత్పత్తిలో కూడా గణనీయమైన వృద్ధి రేటు సాధించిందనీ.. 1.4 శాతం నుంచి 11.7 శాతానికి పెరిగిందని నివేదిక పేర్కొంది. మాంసం ఉత్పత్తికి సంబంధించిన వృద్ధి రేటులో గణనీయమైన మార్పు నమోదైంది. 6.7 శాతం నుంచి 10.3 శాతానికి పెరిగినట్లు నివేదిక స్పష్టం చేసింది. పంటల బీమా 20.2 శాతం నుంచి 26.1 శాతానికి చేరుకుందని నివేదిక వెల్లడించింది.
Read Also : తెలంగాణలో న్యూఇయర్ వేడుకలపై బ్యాన్.. జనవరి 2 వరకు ఆంక్షలు, హద్దు మీరితే
అలాగే... ఏపీ ప్రజారోగ్యంలో కూడా మెరుగైన వృద్దిరేటును నమోదు చేసినట్టు తెలిపింది. ప్రభుత్వ రంగ హాస్పిటల్స్‌లో అందుబాటులో ఉండే వైద్యుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగినట్లు జీజీఐ నివేదిక స్పష్టం చేసింది. GGI 2019లో 90.21 శాతంగా ఉన్న డాక్టర్ల సంఖ్య GGI 2020-21లో 96.61 శాతానికి పెరిగిందని , అలాగే.. ప్రజల్లో రోగనిరోధక శక్తిలో కూడా గణనీయమైన వృద్ధి సాధించిందనీ, 89.96 శాతం నుంచి 97.83 శాతానికి చేరిందని స్పష్టం చేసింది. మాతృ మరణాల సంఖ్య 74 నుంచి 65కి తగ్గితే, శిశుమరణాలు 32 నుంచి 29కి తగ్గాయని, దీంతో రాష్ట్రంలో ప్రజా వైద్య సదుపాయాలు మెరుగ్గా ఉన్నట్టు తెలిపింది.
Read Also : Uttar Pradesh : వేలాది విద్యార్థులకు Free Smartphone, Tablets పంపిణీ
GGI 2021 నివేదిక ను పూర్తిగా పరిశీలిస్తే.. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హరియాణా, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పోర్టల్ స్కోర్‌లో 100 శాతం విజయాన్ని నమోదు చేస్తున్నాయి. గుజరాత్, మహారాష్ట్ర మరియు గోవా రాష్ట్రాలు తమ కాంపోజిట్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ స్కోర్‌లను మెరుగు పరుచు కున్నాయి. GGI 2019 సూచికల కంటే గుజరాత్ 12.3 శాతం మరియు గోవా 24.7 శాతం పెరుగుదలను నమోదు చేసినట్లు GGI 2021 చెబుతోంది.
Read Also : Uttarakhand Election 2022: ఉత్తరాఖండ్‌లో మరోసారి కాషాయ జెండానే.. అంచనా వేసిన తాజా సర్వే.. కానీ..
ఆర్థిక పాలన, మానవ వనరుల అభివృద్ధి, పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & యుటిలిటీస్, సాంఘిక సాంఘిక సంక్షేమ & అభివృద్ధి, న్యాయవ్యవస్థ మరియు ప్రజా భద్రతతో సహా 10 రంగాలలో 5 రంగాలలో గుజరాత్ మెరుగైన పనితీరు కనబరిచింది. మహారాష్ట్ర.. వ్యవసాయం & అనుబంధ రంగం, మానవ వనరుల అభివృద్ధి, పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, యుటిలిటీస్, సాంఘిక సంక్షేమం & అభివృద్ధి రంగాల్లో మెరుగైన పనితీరును కనబరిచింది. గోవా వ్యవసాయం మరియు అనుబంధ రంగం, వాణిజ్యం మరియు పరిశ్రమలు, పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు యుటిలిటీస్, ఆర్థిక పాలన, సాంఘిక సంక్షేమం మరియు అభివృద్ధి మరియు పర్యావరణంలో మెరుగైన పనితీరును కనబరిచిందని నివేదిక పేర్కొంది.