గొల్లలగుంటలో టీడీపీ సర్పంచ్ అభ్యర్ధి భర్త అనుమానాస్పదమృతి: సీఐ, ఎస్‌ఐలు వీఆర్‌కి తరలింపు

By narsimha lodeFirst Published Feb 2, 2021, 4:42 PM IST
Highlights

తూర్పుగోదావరి జిల్లా గొల్లలగుంటలో టీడీపీ సర్పంచ్ అభ్యర్ధి భర్త శ్రీనివాస్ రెడ్డి అనుమానాస్పద మృతి ఘటనలో  ఇద్దు పోలీసు అధికారులను వీఆర్ ‌కు పంపాలని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. 


కాకినాడ:తూర్పుగోదావరి జిల్లా గొల్లలగుంటలో టీడీపీ సర్పంచ్ అభ్యర్ధి భర్త శ్రీనివాస్ రెడ్డి అనుమానాస్పద మృతి ఘటనలో  ఇద్దు పోలీసు అధికారులను వీఆర్ ‌కు పంపాలని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. 

also read:గొల్లలగుంటలో టీడీపీ సర్పంచ్ అభ్యర్ధి భర్త అనుమానాస్పదమృతి: ఆరా తీసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ

గొల్లలగుంట గ్రామంలో సర్పంచ్ అభ్యర్ధి పుష్పలత భర్త శ్రీనివాస్ రెడ్డిని రెండు రోజుల క్రితం  గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఎన్నికల్లో పోటీకి దిగొద్దని హెచ్చరించారు. ఇవాళ ఆయన అనుమానాస్పదస్థితిలో మరణించారు. 

ఈ విషయం తెలుసుకొన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గ్రామంలో పర్యటించారు. మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించారు.

ఈ కేసు విచారణను ఏస్పీ విచారిస్తున్నారు. ఈ కేసులో సీఐ కిషోర్ బాబు, ఎస్ఐలపై చర్యలకు ఎస్ఈసీ ఆదేశించారు. వీరిద్దరిని వీఆర్ కు పంపాలని ఆదేశించారు. ఈ కేసును ఎస్పీ విచారిస్తున్నారు.
 

click me!