దుర్గ గుడిలో బంగారం చోరీ.. ఉద్యోగి చేతివాటం

Published : Jun 04, 2019, 01:53 PM IST
దుర్గ గుడిలో బంగారం చోరీ.. ఉద్యోగి చేతివాటం

సారాంశం

దుర్గ గుడిలో బంగారం చోరీ సంఘటన కలకలం రేపుతోంది. ఆలయంలోని హుండీలోని బంగారం ఆలయ ఉద్యోగే దొంగలించడం గమనార్హం. 

దుర్గ గుడిలో బంగారం చోరీ సంఘటన కలకలం రేపుతోంది. ఆలయంలోని హుండీలోని బంగారం ఆలయ ఉద్యోగే దొంగలించడం గమనార్హం. హుండి లెక్కింపు చేపడుతున్న సమయంలో ఉద్యోగి తన చేతి వాటం ప్రదర్శించడం కలకలం రేపుతోంది.

దుర్గగుడిలో సింహాచలం అనే ఉద్యోగి గత కొంతకాలంగా పని చేస్తున్నాడు. అతని భార్య దుర్గ కూడా గుడిలోనే కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తోంది. అయితే హుండీలోని బంగారాన్ని సింహాచలం చోరీ చేసి.. తన భార్య దుర్గ చేతికి బంగారం ఇచ్చి పంపుతుండగా దుర్గగుడి అధికారులు పట్టుకున్నారు. సింహాచలం దంపతులు 8 గ్రాముల బంగారాన్ని చోరీ చేసినట్టు గుర్తించారు. అధికారుల ఫిర్యాదుతో పోలీసులు సింహాచలం దంపతులను అదుపులోకి తీసుకున్నారు.

PREV
click me!

Recommended Stories

TTD: తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. బ్రహ్మోత్సవాల వేళ రూ. 300 టికెట్ల షెడ్యూల్ విడుద‌ల
AP Pensions: ఆంధ్ర‌ప్ర‌దేశ్ పెన్ష‌న్ల‌లో కీల‌క మార్పులు.. ఇక‌పై రెండు విధాలుగా డ‌బ్బులు