దారుణం..మామ కళ్లల్లో కారం కొట్టిన కోడలు

Published : Jun 04, 2019, 12:50 PM IST
దారుణం..మామ కళ్లల్లో కారం కొట్టిన కోడలు

సారాంశం

తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. తండ్రి లాంటి మామగారిపై రాక్షసంగా ప్రవర్తించింది ఓ కోడలు. మామ కళ్లలో కోడలు కారం కొట్టింది. అది చూసిన కొడుకు తండ్రిని కాపాడాల్సింది పోయి.. మరింత క్రూరంగా ప్రవర్తించాడు. 

తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. తండ్రి లాంటి మామగారిపై రాక్షసంగా ప్రవర్తించింది ఓ కోడలు. మామ కళ్లలో కోడలు కారం కొట్టింది. అది చూసిన కొడుకు తండ్రిని కాపాడాల్సింది పోయి.. మరింత క్రూరంగా ప్రవర్తించాడు. ఇనుప రాడ్డుతో తండ్రి తలపై దారుణంగా కొట్టింది. కొడుకు, కొడలి దాడిలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్తి కోసమే వీళ్లు ఇలా చేశారని తెలుస్తోంది.

గత కొంతకాలంగా... వృద్ధుడిని ఇంట్లో బంధించి... హింసిస్తున్న కొడుకు, కోడలు.. మంగళవారం వీధిలో అందరూ చూస్తుండగానే దారుణానికి పాల్పడ్డారు. కొడుకు, కోడలు పెడుతున్న బాధలు తట్టుకోలేక పారిపోవడానికి ప్రయత్నించగా... ఇలా కళ్లలో కారం కొట్టి.. తలపై కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ వీధిలోని వాళ్లంతా ఆ దృశ్యాలను వాట్సాప్‌లో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చుట్టుపక్కలవాళ్లంతా కలిసి బాధితుడిని రుయా ఆసుపత్రికి తరలించారు.
 
బాధితుడు ఇంతకు ముందే ఎన్నోసార్లు తిరుపతి వెస్ట్ జోన్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే ప్రస్తుతం దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో షేర్ అవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

PREV
click me!

Recommended Stories

Chandrababu, Lokesh కి వెంకన్న ప్రసాదం ఇచ్చిన టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ | Asianet News Telugu
నారావారిపల్లెలో CM Chandrababu Family గంగమ్మ, నాగాలమ్మకు ప్రత్యేక పూజలు | Asianet News Telugu