మహేష్ హత్య కేసు: గోవాలో ఇద్దరి అరెస్ట్, మహిళ వ్యవహరమే హత్యకు కారణమా?

Published : Oct 14, 2020, 02:49 PM ISTUpdated : Oct 14, 2020, 03:12 PM IST
మహేష్ హత్య కేసు: గోవాలో ఇద్దరి అరెస్ట్, మహిళ వ్యవహరమే హత్యకు కారణమా?

సారాంశం

నగరంలోని కమిషనరేట్ కార్యాలయంలో పనిచేసే మహేష్ హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గోవా పోలీసులు ఈ విషయమై సమాచారం ఇవ్వడంతో విజయవాడ పోలీసులు గోవాకు బయలుదేరారు. ఓ మహిళ కారణంగానే ఈ హత్యకు కారణంగా పోలీసులు చెబుతున్నారు.


విజయవాడ: నగరంలోని కమిషనరేట్ కార్యాలయంలో పనిచేసే మహేష్ హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గోవా పోలీసులు ఈ విషయమై సమాచారం ఇవ్వడంతో విజయవాడ పోలీసులు గోవాకు బయలుదేరారు. ఓ మహిళ కారణంగానే ఈ హత్యకు కారణంగా పోలీసులు చెబుతున్నారు.

సీపీ కార్యాలయ ఉద్యోగి మహేష్ పై  కాల్పులు జరిపిన ఇద్దరు నిందితులను గోవా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ విషయమై విజయవాడ పోలీసులకు సమాచారం అందింది. గోవాకు విజయవాడ పోలీసులు బయలుదేరారు. గోవాకు వెళ్లాల్సిన విమానం మిస్ కావడంతో విజయవాడ పోలీసులు హైద్రాబాద్ ఎయిర్ పోర్టులో ఉన్నారు.

also read:బెజవాడలో మహేష్ హత్య కేసులో ట్విస్ట్: కారు రివర్స్ చేసి..

ఓ మహిళ విషయమై మహేష్ హత్య జరిగినట్టుగా పోలీసులు చెబుతున్నారు. సాత్విక్ రెడ్డి ఈ విషయంలో కీలకంగా వ్యవహరించినట్టుగా పోలీసులు తెలిపారు.

ఈనెల 10వ తేదీ రాత్రి విజయవాడలో  కాల్పులు జరగడంతో  మహేష్ మరణించాడు. మహేష్ ను హత్య చేసిన తర్వాత ఇద్దరు నిందితులు గోవాకు పారిపోయారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 
 

PREV
click me!

Recommended Stories

Arasavalli Rathasapthami: అరసవల్లిలో 80 ఫీట్ రోడ్డులో మెగా సూర్యనమస్కారాలు | Asianet News Telugu
Spectacular Drone Show in Arasavalli మోదీ, చంద్రబాబు చిత్రాలతో అదరగొట్టిన డ్రోన్ షో | Asianet Telugu