ప్రముఖ నృత్యకళాకారిణి శోభానాయుడు మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని, ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
ప్రముఖ నృత్యకళాకారిణి శోభానాయుడు మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని, ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
‘‘తన నాట్యప్రతిభతో దేశవిదేశాల్లో భారతీయ కళల కీర్తిప్రతిష్టలను శోభానాయుడు పెంచారు. అంతర్జాతీయంగా కూచిపూడి నాట్యానికి పేరుప్రతిష్టలు ఇనుమడింప చేశారు. ఆమె సాధించిన అవార్డులు, రివార్డులే శోభానాయుడు కళా ప్రతిభకు తార్కాణాలు అని పేర్కొన్నారు.
శోభానాయుడు మృతితో తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డను కోల్పోయింది. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు.
ప్రముఖ కూచిపూడి కళాకారిణి శోభానాయుడు గతరాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె కరోనా బారినపడటంతో గత కొన్ని రోజులకుగా హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమంగా ఉండటంతో ఆమె వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 58 సంవత్సరాలు.
వెంపటి చినసత్యం శిష్యురాలిగా ఆమె పలు ప్రదర్శనలు ఇవ్వడమే కాకుండా పద్మశ్రీ అవార్డును సైతం అందుకున్నారు. ఆమె కూచిపూడి డాన్స్ అకాడెమీని ఏర్పాటుకి చేసి పలువురికి శిక్షణ అందించారు. దేశ విదేశాల్లో ఆమెకు దాదాపుగా 1500 మంది శిష్యులు ఉన్నారు. భారత ప్రభుత్వం 2001లో పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది.