ఎపి రాజకీయాల్లో ఎంట్రీకి నందమూరి సుహాసిని రెడీ

Published : Jan 17, 2019, 07:01 AM IST
ఎపి రాజకీయాల్లో ఎంట్రీకి నందమూరి సుహాసిని రెడీ

సారాంశం

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని సుహాసిని అన్నారు. సంక్రాంతి సందర్భంగా తెనాలి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. 

తెనాలి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి దివంగత నేత నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసినీ రెడీగా ఉన్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో హైదరాబాదులోని కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఆమె ఓటమి పాలైన విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సుహాసినీ ఆ రాష్ట్ర రాజకీయాల్లో భవిష్యత్తును పరీక్షించుకోవాలని అనుకుంటున్నారు. ఆమె బుధవారం గుంటూరు జిల్లా తెనాలిలో చేసిన ప్రకటన ఆ విషయాన్ని పట్టిస్తోంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని సుహాసిని అన్నారు. సంక్రాంతి సందర్భంగా తెనాలి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. 

ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు చంద్రబాబు  కృషి చేస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ విజయానికి తమ కుటుంబం శక్తి వంచన లేకుండా సహకరిస్తుందని సుహాసిని చెప్పారు.

PREV
click me!

Recommended Stories

CM Nara Chandrababu Naidu: మహిళా సంఘాలకు చెక్కులను అందజేసిన సీఎం చంద్రబాబు| Asianet News Telugu
CM Chandrababu In Saras Mela At Guntur: ఈ మహిళా స్పీచ్ కి సీఎం చంద్రబాబు లేచి మరీ | Asianet Telugu