28 ఏళ్ల పరిచయం: బాబు దీక్షలో ఆజాద్

By narsimha lodeFirst Published Feb 11, 2019, 3:35 PM IST
Highlights

మోడీలాంటి ప్రధానిని ఇంత వరకు చూడలేదు... ఇక భవిష్యత్తులో కూడ ఇలాంటి పీఎంను తాను చూడబోనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు.
 


న్యూఢిల్లీ: మోడీలాంటి ప్రధానిని ఇంత వరకు చూడలేదు... ఇక భవిష్యత్తులో కూడ ఇలాంటి పీఎంను తాను చూడబోనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు న్యూఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద 12 గంటల పాటు దీక్ష నిర్వహించారు. 

ఈ దీక్షలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌ పాల్గొని తన మద్దతును ప్రకటించారు.చాలా ఏళ్ల  తర్వాత తాను ఏపీ భవన్‌కు వచ్చినట్టుగా ఆజాద్ గుర్తు చేసుకొన్నారు. చంద్రబాబునాయుడుతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని ఆజాద్ ఈ సభలో చెప్పారు.

తమ మధ్య సుమారు 28 ఏళ్ల పరిచయం ఉందని ఆయన ప్రస్తావించారు. పార్టీల పరంగా తమ ఇద్దరి మధ్య విబేధాలు ఉన్నాయన్నారు.మోడీ లాంటి ప్రధానిని తాను గతంలో చూడలేదన్నారు. 

భవిష్యత్తులో ఇక చూడబోనని  కూడ ఆజాద్  చెప్పారు. మోడీ అనుసరించిన విధానాల వల్ల దేశంలో రైతులు ఆందోళనలకు దిగారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాను చట్టంలోనే తమ పార్టీ పెట్టిందన్నారు.

కానీ,  మోడీ సర్కార్ ఏపీకి ప్రత్యేక హోదాను అమలు చేయలేదని ఆయన చెప్పారు.  ఏపీ విభజన సమయంలో రాజ్యసభలో ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేపీ నేతలు డిమాండ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతు: శరద్ పవార్

మోడీ సభకు వైసీపీ ఫ్లెక్సీలు: గుట్టు విప్పిన లోకేష్

దేవుడి సాక్షిగా ప్రమాణం చేసి....: మోడీపై కేజ్రీవాల్ ఫైర్

ఏపీ డిమాండ్లు నెరవేర్చాలి: ములాయం

దీక్ష: జయరామ్ రమేష్‌కు చంద్రబాబు కితాబు

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి: మన్మోహన్ సింగ్

ఏపీ భారత్‌లో భాగం కాదా: చంద్రబాబు దీక్షకు రాహుల్ మద్దతు

click me!