మీకు తగిలిన గాయం నా గుండెకు తగిలింది: వైసీపీ శంఖారావంలో వైఎస్ జగన్

By Nagaraju penumalaFirst Published Feb 11, 2019, 3:16 PM IST
Highlights

త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని మూడు నెలల్లో అన్ని ఎన్నికలు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతీ వైసీపీ కార్యకర్తపై ఉందన్నారు. రాక్షసులతో, మోసగాళ్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని తెలిపారు. రాక్షసులతో యుద్ధం చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొచ్చారు. 

అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు తగిలిన గాయం తన గుండెకు తగిలిన గాయంగా భావిస్తానని వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

అనంతపురం జిల్లాలో వైసీపీ సమర శంఖారావం సభలో పాల్గొన్న జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అనంతపురం జిల్లా వాసులు సర్వం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదున్నరేళ్లలో అనంతపురం జిల్లాలో 1280 మంది వైసీపీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ దొంగకేసులు పెట్టి వేధింపులకు పాల్పడిందని ఆరోపించారు. 

ప్రతీ కార్యకర్తను తన కుటుంబ సభ్యుడిగా చూసుకుంటానని భరోసా ఇచ్చారు. ప్రజలు భాగోగులు తానే చూసుకుంటానని హామీ ఇచ్చారు. అవినీతి లేని స్వచ్ఛమైన పాలన పేదవాడికి అందించాలన్నదే తన లక్ష్యమని జగన్ చెప్పుకొచ్చారు. 

click me!