టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి విశాఖ పర్యటనకు పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు డుమ్మా కొట్టారు. చంద్రబాబును పోలీసులు అడ్డుకుంటున్న సమయంలో పలువురు టీడీపీ నేతలు కనిపించారు. కానీ గంటా కనిపించలేదు.
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి విశాఖపట్నం పర్యటనకు పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు దూరంగా ఉన్నారు. విశాఖపట్నం విమానాశ్రయం వద్ద చంద్రబాబు పర్యటన నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ స్థితిలో కూడా ఆయన చంద్రబాబు పక్కన కనిపించలేదు.
విశాఖపట్నం జిల్లాకు చెందిన అచ్చెన్నాయడు, తదితర నాయకులు చంద్రబాబు పక్కన కనిపించారు. విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన శ్రీభరత్ కూడా సంఘటనా స్థలంలో ఉన్నారు.
undefined
Also Read: "సెక్షన్ 151" కింద చంద్రబాబు అరెస్ట్: ఆ సెక్షన్ ఎం చెబుతుందంటే..
చంద్రబాబు విశాఖ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. చంద్రబాబు విశాఖ ర్యాలీకి పోలీసులు అనుమతించలేదు. దీంతో చంద్రబాబు విమానాశ్రయం వద్ద రోడ్డుపై బైఠాయించారు.
పలువురు టీడీపీ నాయకులు చంద్రబాబుతో ఉన్నప్పటికీ గంటా శ్రీనివాస రావు మాత్రం కనిపించలేదు. ఆయన పార్టీ మారుతారనే ప్రచారం ఎప్పటికప్పుడు జరుగుతున్నప్పటికీ టీడీపీలోనే కొనసాగుతూ వస్తున్నారు.
Also Read: విశాఖలో చంద్రబాబు అరెస్ట్, ఎయిర్‌పోర్ట్ లాంజ్‌కు తరలింపు