"సెక్షన్ 151" కింద చంద్రబాబు అరెస్ట్: ఆ సెక్షన్ ఎం చెబుతుందంటే...

By telugu team  |  First Published Feb 27, 2020, 4:54 PM IST

పోలీసు ఉన్నతాధికారులు చేసేదేమిలేక వైజాగ్ ఎయిర్ పోర్ట్ ముందు చంద్రబాబును అరెస్టు చేసారు. తమకు పర్మిషన్ ఇచ్చి ఇలా అరెస్ట్ చేయడమేంటనీ చంద్రబాబు ప్రశ్నించినప్పటికీ.... సెక్షన్ 151 కింద అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు చెప్పి అదుపులోకి తీసుకున్నారు. 


విశాఖపట్నం: ప్రజాచైతన్య యాత్రలో భాగంగా విశాఖపట్నం చేరుకున్న చంద్రబాబు నాయుడును వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అడ్డుకున్న విషయం తెలిసిందే. ఆయనకు స్వాగతం తెలిపేందుకు వెళ్లిన టీడీపీ శ్రేణులు, అడ్డుకోవడాయినికి వచ్చిన వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట కూడా జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

మరోపక్క చంద్రబాబు సైతం అక్కడే ఎయిర్ పోర్టు ముందు బైఠాయించారు. ఇదంతా గమనించిన పోలీసు ఉన్నతాధికారులు చేసేదేమిలేక వైజాగ్ ఎయిర్ పోర్ట్ ముందు చంద్రబాబును అరెస్టు చేసారు. తమకు పర్మిషన్ ఇచ్చి ఇలా అరెస్ట్ చేయడమేంటనీ చంద్రబాబు ప్రశ్నించినప్పటికీ.... సెక్షన్ 151 కింద అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు చెప్పి అదుపులోకి తీసుకున్నారు. 

Latest Videos

ఈ నేపథ్యంలో అసలు ఈ సెక్షన్ 151 అంటే ఏమిటనే చర్చ మొదలయింది. వాస్తవానికి ఈ 151 సెక్షన్ సీఆర్పీసీ పరిధిలోనిది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పరిధిలోకి వచ్చే ఈ సెక్షన్ 151 ప్రకారం ఎవరినైనా ప్రత్యేక పరిస్థితుల్లో అరెస్ట్ చేయవచ్చు. 

సదరు వ్యక్తివల్ల ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతాయనే అనుమానం గనుక ఉంటె... పరిస్థితులు అరెస్ట్ చేయకపోతే అదుపులోకి రావు అని భావించినట్టయితే ఈ సెక్షన్ 151 ని ఉపయోగించే ఆస్కారం పోలీసులకు ఉంటుంది. 

ఆ సదరు వ్యక్తిని అరెస్ట్ చేయకపోతే పరిస్థితులు మరింత దిగజారే ఆస్కారం ఉందని పోలీసులు బలంగా నమ్మితే వారు ఈ విధమైన అరెస్ట్ లను చేయవచ్చు. ఈ అరెస్టులు చేయడానికి పోలీసులకు మెజిస్ట్రేట్ అనుమతి లేకుండానే చేయవచ్చు. 

కాకపోతే ఈ సెక్షన్ కింద అరెస్ట్ చేసిన నేతను 24 గంటల్లోపల విడుదల చేయవలిసి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో లేదా వేరే అధీకృతమైన సంస్థనుండి పర్మిషన్ పొందినప్పుడు మాత్రమే 24 గంటల తరువాత కూడా అదుపులో ఉంచుకునేందుకు పోలీసులకు ఆస్కారం కల్పిస్తుంది. 

click me!